కరోనా పంజా

ABN , First Publish Date - 2021-05-15T06:41:52+05:30 IST

అనంతపై కరోనా పంజా విసురుతోంది. వైర స్‌ విరుచుకుపడడంతో జిల్లాలోని అన్ని ప్రాం తాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా పంజా

ఒకేరోజు 11 మంది మృతి

కొత్తగా 2213 మందికి పాజిటివ్‌

అనంతపురం వైద్యం, మే14: అనంతపై కరోనా పంజా విసురుతోంది. వైర స్‌ విరుచుకుపడడంతో జిల్లాలోని అన్ని ప్రాం తాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పల్లె జనం జ్వరాలు, జలుబు, ఒళ్లు నొప్పులతో విలవిల్లాడిపోతున్నారు. కొవిడ్‌ చికిత్సలు అందుబాటులో లేక ఆర్‌ఎంపీలే వారికి దిక్కవుతున్నారు. అందినకాడికి వైద్యం చేయించుకుని, ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మరణాలు మరింత అలజడి రేపుతున్నాయి. శుక్రవారం గడిచిన 24 గంటల్లో జిల్లాలో 11 మంది మరణించారు. కొత్తగా అత్యధికంగా 2213 మందికి కరోనా సోకింది. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బారిన 107886 మంది పడ్డారు. ఇందులో 92472 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 757 మంది కరోనాకు బలైపోయారు. ప్రస్తుతం 14657 మంది వైర్‌సతో పోరాడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


50 శాతం దాటిన కరోనా కేసులు

జిల్లాలో 24 గంటల్లో 5402 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2213 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీనిని బట్టి చూస్తే జిల్లాలో 50 శాతానికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. తొలిసారిగా ఇలా పెద్దఎత్తున నమోదు కావడం ఆందోళన రేపుతోంది. ఇందులో అనంతపురం 331, ధర్మవరం 243, తాడిపత్రి 133, కదిరి 120, గుత్తి 84, పుట్టపర్తి 77, హిందూపురం 71, గుంతకల్లు 61,  పెనుకొండ 60, ముదిగుబ్బ 57, తనకల్లు 56, గోరంట్ల 46, కళ్యాణదుర్గం 40, నార్పల 38, ఓడీసీ 35, బుక్కరాయసముద్రం, కూడేరు 33, రాయదుర్గం 32, కణేకట్లు, పెద్దవడుగూరు 31, సోమందేపల్లి, నల్లమాడ, ఉరవకొండ 29, రొళ్ల, పరిగి 27, బత్తలపల్లి, కొత్తచెరువు, మడకశిర 25, కనగానపల్లి 24, యాడికి 23, తలుపుల 22, బొమ్మనహాళ్‌, గార్లదిన్నె, గుడిబండ 21, ఆమడగూరు 20, కంబదూరు, వజ్రకరూరు 19, కుందుర్పి, ఎన్‌పికుంట 18, విడపనకల్లు 16, లేపాక్షి, శింగనమల 14, బెలుగుప్ప, గాండ్లపెంట, శెట్టూరు, తాడిమర్రి 13, ఆత్మకూరు, రాప్తాడు 11, అగళి 10, బుక్కపట్నం, ఎల్లనూరు 9, సీకేపల్లి, పామిడి 8, నల్లచెరువు, పెద్దపప్పూరు 7, బ్రహ్మసముద్రం 6, చిలమత్తూరు, గుమ్మఘట్ట, పుట్లూరు, రామగిరి 5, డీ హీరేహాళ్‌, రొద్దం 2 కేసుల చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-05-15T06:41:52+05:30 IST