37 మండలాల్లో 313 కేసులు

ABN , First Publish Date - 2021-04-17T06:02:13+05:30 IST

కరోనా కంగారు పుట్టిస్తోంది. రోజురోజుకు అనంతను వైరస్‌ వణికిస్తోంది.

37 మండలాల్లో 313 కేసులు

అనంతపురం వైద్యం, ఏప్రిల్‌ 16: కరోనా కంగారు పుట్టిస్తోంది. రోజురోజుకు అనంతను వైరస్‌ వణికిస్తోంది. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 313 మంది కరోనా బారిన పడిన పడినట్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు. వైరస్‌ బారిన పడిన మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 70728 మంది కరోనా బారిన ప డ్డారు. ఇందులో 615 మంది మరణించారు. 68418 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 1695 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కొత్త కేసులు 37 మండలాల్లో నమోదయ్యాయి. అనంతపురం నగరంలో వైరస్‌ తీవ్రత అధికంగానే కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసులలో అనంతపురంలో 88, గుంతకల్లులో 60, హిందూపురంలో 15, తాడిపత్రిలో 14, కదిరిలో 11, లేపాక్షిలో 11, గుత్తిలో 10, పుట్టపర్తిలో 9, కళ్యాణదుర్గంలో 7, బుక్కపట్నంలో 6, పరిగిలో 6, శింగనమలలో 6, తనకల్లులో 6, అమడగూరులో 5, బుక్కరాయసముద్రంలో 5, కొత్తచెరువులో 5, పెనుకొండలో 5, తాడిమర్రిలో 4, ధర్మవరంలో 3, మడకశిరలో 3, ఓడీసీలో 3, రాప్తాడులో 3, వజ్రకరూరులో 3, గుడిబండ, ఉరవకొండలో రెండేసి కేసులు రాగా, బత్తలపల్లి, గోరంట్ల, కణేకల్లు, నల్లచెరువు, నల్లమాడ, పామిడి, పెద్దవడుగూరు, రొద్దం, రొళ్ల, సొమందేపల్లి, యల్లనూరు మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు ఆరుగురు, ఇతర రాష్ట్రానికి చెందిన వారు ఒకరు జిల్లాలో కరోనా బారిన పడ్డారు. కరోనాబారిన పడివారు ఎక్కువ మంది జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లోనే చేరుతున్నారు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రి, సూపర్‌ స్పె షాల్టీ సెంటర్లు కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో శుక్రవారం శారదానగర్‌లోని కేన్సర్‌ యూనిట్‌లోను పడకలు ఏర్పాటు చేశారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో దాదాపు 140 పడకలు ఏర్పాటు చేసి, అవసరమైన వైద్యులు, సిబ్బందిని ఆ విభాగానికి కేటాయించారు.



కరోనా సెకెండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలి: కలెక్టర్‌

అనంతపురం, ఏప్రిల్‌16(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ సెకెండ్‌వేవ్‌ జిల్లాలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో సెకెండ్‌వేవ్‌ను ఎ దుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు నోడల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి కలెక్టర్‌, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కొవిడ్‌ మేనేజ్‌మెంట్‌, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై సీఎం సమీక్షించారు. ఆ సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇంతకు ముందు అన్ని శాఖల అధికారులు కరోనా నియంత్రణకు శక్తివంచన లేకుండా పనిచేశారన్నారు. ప్రస్తుతం కరోనా సెకెండ్‌వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంతకుముందు కంటే ఎక్కువగా పనిచేసి కొవిడ్‌ను అంతం చేయాలన్నారు. జిల్లాలో రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌, పంచాయతీ సిబ్బంది కరోనా వ్యాప్తి అరికట్టడంలో ముఖ్యభూమిక పోషించాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, శాంపిల్‌ టెస్టింగ్‌, బాధితులకు వైద్యమందించడం తదితర అన్ని రకాల అంశాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వ్యాపారులు, అన్ని వర్గాల సహకారంతో కొవిడ్‌ను నియంత్రించేందుకు దృష్టి సారించాలన్నారు. అధికారులు శ్రద్ధపెట్టి పనిచేయకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందన్నారు.  జిల్లాలో ఇంతకుముందు ఆస్పత్రులు, మౌలిక సదుపాయా లు తక్కువగా ఉన్నా అధికారులంతా బాగా పనిచేసి కరో నా వ్యాప్తిని అరికట్టారన్నారు. అదే తరహాలోనే ప్రస్తుత పరిస్థితుల్లోనూ పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీలు నిశాంత్‌కుమార్‌, గంగాధర్‌ గౌడ్‌, డీఎ్‌ఫఓ జగన్నాథ్‌ సింగ్‌, డీఆర్వో గాయత్రీదేవి, డీఎంహెచ్‌ఓ కామేశ్వర ప్రసాద్‌, సీపీఓ ప్రేమ్‌చంద్‌, నోడల్‌ అధికారులు రవీంద్ర, వరప్రసాద్‌, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, డీసీహెచ్‌ఎ్‌స రమే్‌షనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


జిల్లాకు కొవిడ్‌ ప్రత్యేకాధికారిగా ప్రవీణ్‌కుమార్‌ నియామకం

జిల్లాకు కొవిడ్‌ ప్రత్యేకాధికారిగా స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం ఆయన జిల్లాకు రానున్నారన్నారు. జిల్లాలో కొవిడ్‌ ని యంత్రణ, వ్యాక్సినేషన్‌ నిర్వహణలో మార్గదర్శకులుగా ప్రవీణ్‌కు మార్‌ వ్యవహరిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-04-17T06:02:13+05:30 IST