విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ అనంతపురంలో రాస్తారోకో చేస్తున్న కార్మిక, ప్రజా సంఘాల నాయకులు
పెట్రో ధరల పెంపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఆందోళనల పర్వం
అనంతపురం క్లాక్‌టవర్, ఫిబ్రవరి 26: పెట్రో ధరల పెంపు, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిరసనలు హోరెత్తాయి. వినూత్న రీతిలో ఆందోళనలు చేపట్టారు. లారీలు కదలలేదు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా అనంతలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ వద్ద ఆటోలను లాగుతూ, బహిరంగ వేలం వేస్తూ వినూత్నరీతిలో నిరసన తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ కేంర దంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ పేదల నుంచి జలగల్లా పీల్చుతూ సొంత ఖజానా నింపుకుంటోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేసి, వాహనదారులను, ప్రజలను దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రంమలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణుడు, మున్సిపల్ వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజే్‌షగౌడ్, నాయకులు రాజు, గోపాల్, సురేష్, రమేష్, మధు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట, సప్తగిరి సర్కిల్లోని పెట్రోలు బంకు వద్ద నిరసన చేపట్టారు.
ఆగిపోయిన లారీలు
అనంతపురం వ్యవసాయం: డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ అనంతపురం లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో లారీలను ఆపేశారు. స్థానిక పాతూరులో లారీలు నిలిపివేసి, నిరసన తెలిపారు. పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని ఆ సంఘం అధ్యక్షుడు సాలార్ బాషా, కార్యదర్శి ఓబులయ్య, నాయకులు రఫీ, రాము, కృష్ణ, గిడ్డయ్య, బాబు, ప్రసాద్, రంగ, రహంతుల్లా, సత్తి డిమాండ్ చేశారు.
ఐక్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
కార్మిక, ప్రజాసంఘాల నాయకుల రాస్తారోకో, అరెస్టు
అనంతపురం క్లాక్‌టవర్, ఫిబ్రవరి 26: వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను ఐక్యపోరాటాలతో అడ్డుకుంటామని కార్మిక, ప్రజాసంఘాల నేతలు ఉద్ఘాటించారు. కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక టవర్‌క్లాక్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు, ఆం దోళనకారుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం కార్మిక, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, రైతుసంఘం జిల్లా కార్యదర్శి కాటమయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణకు కేంద్రప్రభుత్వ ద్వారాలు తెరవటం దారుణమన్నారు. ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు సంఘటితంగా పోరాడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం తెలుగు ప్రజలపై చిత్తశుద్ధి ఉన్నా వెంటనే శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతో్‌షకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రాము, శ్రీనాథ్, విజయ్‌కుమార్ రెడ్డి, నగర అధ్యక్షకార్యదర్శులు మన్సూర్‌అహ్మద్, మోహన్‌కృష్ణ, దేవేంద్ర, రుద్రేశ్.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు వినతిపత్రం అందజేశారు.