నేడు కొండమీదరాయడి రథోత్సవం

ABN , First Publish Date - 2021-02-27T06:26:51+05:30 IST

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామి వారి రఽథోత్సవం శనివారం నిర్వహించనున్నారు.

నేడు కొండమీదరాయడి రథోత్సవం
ముస్తాబైన రథం..

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 26: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ కొండమీదరాయుడు స్వామి బ్రహోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామి వారి రఽథోత్సవం శనివారం నిర్వహించనున్నారు. స్వామి వైభవా న్ని కనులారా చూసి, తరించేందుకు భక్తులు పెద్ద సం ఖ్యలో తరలిరానున్నారు. ఇందుకు ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి వారి బ్రహోత్సవాల ఏడో రోజు మాఘ శుద్ధి పౌర్ణమి దినాన స్వామి వారు రథోత్సవంపై విహరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. శనివారం ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు మడుగు తేరు లాగుతారు. అంతకుముందు వేద పండితుల రథోత్సవం వద్ద హోమం ఏర్పాటు చేసి, పూజలు నిర్వహిసా ్తరు. వేకువజామున స్వామి వారికి భూదేవీశ్రీదేవితో క ల్యాణోత్సవం నిర్వహిస్తారు. అనంతరం సూర్యప్రభ వాహనంపై స్థానిక లక్ష్మీనారాయణస్వామి దేవాలయం నుంచి స్వామివారిని పల్లకీ సేవలో రథోత్సవం వద్దకు తీసుకొస్తారు. స్వామి వారి ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి, తేరును లాగడం ప్రారంభిస్తారు. ఉద యం లాగే మడుగు తేరు స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు లాగుతారు. అనంతరం మధ్యాహ్నం 3.30 నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నుంచి బ్రాహ్మణవీధి వరకు లాగి, తిరిగి యథాస్థానానికి చేర్చుతారు. అంతటితో రథోత్సవం ముగుస్తుంది. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా రాయలసీమలోని వివిధ ప్రాంతాలు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 


ఏర్పాట్లు పూర్తి

నేడు కొండమీదరాయ స్వామి రథోత్సవం సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దేవరకొండ వ ద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ క మిటీ సభ్యులు తెలిపారు.  బుక్కరాయసముద్రం సీఐ సాయిప్రసాద్‌, ఎస్‌ఐ ప్రసాద్‌ అధ్వర్యంలో ఐదుగురు ఎస్‌ఐలు, 20 మంది ఏఎ్‌సఐలు, 50 మంది కానిస్టేబు ళ్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు, మూడు బృందాల స్సెషల్‌ పార్టీ సిబ్బంది, సీసీఎస్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.



Updated Date - 2021-02-27T06:26:51+05:30 IST