అభివృద్ధి పనులే టీడీపీని గెలిపిస్తాయి

ABN , First Publish Date - 2021-03-05T06:43:59+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, మున్సిపాల్టీలో టీడీపీ జెండా ఎగరేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల కృష్ణ అన్నారు.

అభివృద్ధి పనులే టీడీపీని గెలిపిస్తాయి
ప్రచారంలో మాట్లాడుతున్న బాలకృష్ణ

హిందూపురాన్ని  జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

8 టీడీపీని గెలిపిస్తే.. ఇంటింటికి ఉచిత నీరు 

8 అరాచక వైసీపీకి  ఓటుతో బుద్ధి చెప్పండి

8 ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

హిందూపురం, మార్చి 4: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, మున్సిపాల్టీలో టీడీపీ జెండా ఎగరేస్తామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల కృష్ణ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆయన హిందూపురంలో టీడీపీ కౌన్సిల్‌ అభ్యర్థులతో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలనలో చేసినఅభివృద్ధి కళ్ల ముందు కన్పి స్తోందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏమి అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే హిందూపురానికి శాశ్వత తాగునీరు ఇచ్చామని, కృష్ణా జలాలతో చెరువులను నిం పామన్నారు. రోడ్లు వేశాం. పట్టణాన్ని సుందరంగా, విద్య, వైద్యం, పారిశ్రామికాభివృద్ధి చేశామన్నారు. ప్రజలు కడుతున్న పన్నుల డబ్బుతోనే సంక్షే మ పథకాల పేరుతో మీకు ఇస్తున్నారు తప్ప వైసీపీ వారు ఏమైనా వారి జేబుల్లో నుంచి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. వైసీపీకి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే  ఇంటింటికీ కొళాయి ఉచిత కనెక్షన్‌తోపాటు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. చేతకాని వైసీపీ నాయకులు హిందూపురానికి వచ్చిన వైద్య కళాశాలను నిలబెట్టుకోలేకపోయారని మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామన్నారు. జిల్లా కేంద్రం ప్రకటించిన వెంటనే హిందూపురంలో బసవతారక కేన్సర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు జవాబుదారితనంతో ఉన్న టీడీపీకి మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. సూగూరు ఆంజనేయ స్వామి ఆల యంలో పూజలు నిర్వహించి పట్టణంలోని అభ్యర్థులతో మోతకపల్లి, విద్యానగర్‌, మేళాపురం, ముద్దిరె డ్డిపల్లి, సింగిరెడ్డిపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయన వెంట టీడీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి, అహుడా మాజీ చైర్మన్‌ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ ఎన్నికల పరిశీలకులు సవితమ్మ, మనోహర్‌నాయుడు, నరసింహులు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రావెళ్ల లక్ష్మీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అంజినప్ప, నాయకులు నాగరాజు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-05T06:43:59+05:30 IST