స్పందించిన మానవతామూర్తులు

ABN , First Publish Date - 2021-05-12T07:09:37+05:30 IST

ఆర్డీటీ చేపట్టిన స్పందించు... ఆక్సిజన్‌ అందించు నినాదానికి మానవతామూర్తులు స్పందిస్తున్నారు.

స్పందించిన మానవతామూర్తులు
చెక్‌ అందజేస్తున్న తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం నాయకులు

అనంతపురం క్లాక్‌టవర్‌/క్రైం, మే 11: ఆర్డీటీ చేపట్టిన స్పందించు... ఆక్సిజన్‌ అందించు నినాదానికి మానవతామూర్తులు స్పందిస్తున్నారు. జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మంగళవారం పలువురు ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాలాఫెర్రర్‌ను కలిసి, విరాళాల చెక్‌లు అందజేశారు. తాడిపత్రి ఆర్యవైశ్య సంఘం నాయకులు రూ.5,01,116 విరాళంగా ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు తలుపుల సురేంద్రనాథ్‌, ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి జయవరం అశ్వత్థం రంగయ్య, కోశాధికారి వెంకటధరరాజు, సభ్యులు తదితరులు చెక్‌ అందజేశారు.

- గుత్తి టీచర్ల సంఘం నాయకులు రూ.2.07 లక్షల చెక్‌ అందజేశారు. కార్యక్రమంలో గుత్తి ఎంఈఓ రవినాయక్‌, ఆర్డీటీ డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, రఫీక్‌, రంగప్పచౌదరి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- అనంతపురం రోటరీక్లబ్‌ సభ్యులు రూ.1.5 లక్షల చెక్‌ అందజేశారు. క్లబ్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌, కార్యదర్శి సాయి కుమార్‌, సభ్యుడు మేడా రంగనాథ్‌ పాల్గొన్నారు.

- అనంతురం అసాద్‌ ఫార్మ్స్‌ ఎండీ జీఎస్‌ మన్సూర్‌ రూ.లక్ష విరాళం అందజేశారు.

- జిల్లా సెబ్‌ పోలీసులు రూ.2 లక్షలను స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో మంగళవారం విశాలాఫెర్రర్‌కి సెబ్‌ ఏఎస్పీ రామ్మోహన్‌రావు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో సెబ్‌ సూపరింటెండెంట్లు నారాయణస్వామి, గోపాల్‌, రా ష్ట్ర ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్ల సంఘం హిందూపురం సెబ్‌ సీఐ నరసింహులు, కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ నాయకుడు బాలాజీ హాజరయ్యారు.

- జీవీఎ్‌సఎస్‌ నాయకులు ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్‌ విశాలాఫెర్రర్‌కు రూ.10వేల చెక్‌ అందజేశారు. కార్యక్రమంలో జీవీఎ్‌సఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్‌నాయక్‌, కార్యదర్శులు దశరథ్‌నాయక్‌, మనోజ్‌కుమార్‌, దినకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T07:09:37+05:30 IST