ప్రభుత్వ వైద్యుడిపై విచారణ

ABN , First Publish Date - 2022-05-17T03:42:44+05:30 IST

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు షేక్‌ సందానీబాషాపై సోమవారం ఆత్మకూరు జిల్లా వైద్యశాల ఆర్‌ఎంవో ఉషాసుందరి విచారణ చేపట్టారు.

ప్రభుత్వ వైద్యుడిపై విచారణ
రిజిస్టర్లు పరిశీలిస్తున్న ఉషాసుందరి

ఉదయగిరి రూరల్‌, మే 16: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు షేక్‌ సందానీబాషాపై సోమవారం ఆత్మకూరు జిల్లా వైద్యశాల ఆర్‌ఎంవో ఉషాసుందరి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 4న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యుడు రూ.15 వేలు డిమాండ్‌ చేశారనే ఆరోపణపై జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు, డీసీహెచ్‌ఎ్‌స రమే్‌షనాథ్‌ల ఆదేశాల మేరకు విచారణ చేపడుతున్నామన్నారు. విచారణకు హాజరు కావాలని బాఽధితురాలికి ముందస్తు సమాచారం అందించామన్నారు. అయినా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేదన్నారు. ఈ విషయాన్ని డీసీహెచ్‌ఎ్‌స దృష్టికి తీసుకెళ్లగా బాధితురాలు వచ్చిన తరువాతే విచారణ చేపట్టాలని సూచించారన్నారు. బాఽధితురాలు వచ్చిన తరువాత మళ్లీ విచారణ చేపట్టి సంబంధిత నివేదికలు ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. తొలుత ఆమె అటెండెన్స్‌, ఓపీ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీడీవో హాసీనా, యూడీసీ కమల్‌కిరణ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T03:42:44+05:30 IST