ఆత్మకూరు బరిలో ఎంతమంది అంటే..
ABN , First Publish Date - 2022-06-10T00:47:07+05:30 IST
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు గురువారం నామినేషన్ ఉపసంహరణ ఘట్టం ముగిసింది. చివరిరోజు
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు గురువారం నామినేషన్ ఉపసంహరణ ఘట్టం ముగిసింది. చివరిరోజు ఇండిపెండెంట్ అభ్యర్థి బొర్రా సుబ్బారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.కాగా ఉప ఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను రిటర్నింగ్ అధికారి హరేందిర ప్రసాద్ ప్రకటించారు. శుక్రవారం నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక జరగనున్నది. ఈనెల 26వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
బరిలో నిలిచిన అభ్యర్థులు
1 మేకపాటి విక్రమ్‌రెడ్డి - వైసీపీ
2 గుండ్లవల్లి భరత్‌కుమార్ - బీజేపీ
3 నందా ఓబులేశు - బీఎస్పీ
4 షేక్ జలీల్ - నవరంగ్ కాంగ్రెస్ పార్టీ
5 షేక్ మొయినుద్దీన్ - ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
6 బండారు రవి - హర్ధమ్ మన్వట్వాడి రాష్ట్రీయ దళ్
7 బూరుగ రత్నం - ఇండిపెండెంట్
8 చల్లా పెంచలమోహన్రెడ్డి - ఇండిపెండెంట్
9 పెనాకా అమర్నాథ్రెడ్డి - ఇండిపెండెంట్
10 పెయ్యల హజరత్తయ్య - జనంమనం పార్టీ
11 రావులకొల్లు మాలకొండయ్య - ఇండిపెండెంట్
12 షేక్ మహబూబ్‌బాష - అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
13 తూమాటి శశిధర్‌రెడ్డి - ఇండిపెండెంట్
14 లాలి వెంకటయ్య - ఇండిపెండెంట్