ఏటీఎం విత్‌డ్రాయల్‌ చార్జీల రద్దు

ABN , First Publish Date - 2020-03-25T06:40:17+05:30 IST

దేశంలో కోవిడ్‌-19 విజృంభణ. సగటు జీవులు, ఎంఎ్‌సఎంఈలు, సగటు పౌరులపై దాని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అన్ని వర్గాలకు ఊరట కల్పించేందుకు పలు చర్యలు ప్రకటించారు.

ఏటీఎం విత్‌డ్రాయల్‌ చార్జీల రద్దు

ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా డబ్బు తీసుకునే వెసులుబాటు..  

బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ నిబంధనకు విరామం

కంపెనీలపై దివాలా చర్యలకు మూడు నెలల మారటోరియం

త్వరలో కరోనా ఆర్థిక ప్యాకేజీ

నిర్మల  సీతారామన్‌ కీలక ప్రకటనలు


న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌-19 విజృంభణ. సగటు జీవులు, ఎంఎ్‌సఎంఈలు, సగటు పౌరులపై దాని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ అన్ని వర్గాలకు ఊరట కల్పించేందుకు పలు చర్యలు ప్రకటించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ ప్రకటించడం, ఆర్థిక కార్యకలాపాలకు పెను అంతరాయం ఏర్పడడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ విస్తృతమైన చర్యలు ప్రకటించినట్టు చెప్పారు. ఈ మహమ్మారి వల్ల ఏర్పడుతున్న భారీ నష్టాల నుంచి బిన్న వర్గాలను కాపాడేందుకు ఉద్దీపన ప్యాకేజి సిద్ధం అవుతున్నదని, వీలైనంత త్వరలోనే అది ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆమె ప్రకటించిన చర్యల్లో ఐటీ రిటర్న్‌లు, జీఎ్‌సటీ రిటర్న్‌ల దాఖలుకు గడువు పెంపు, ఏటీఎం విత్‌డ్రాయల్స్‌పై ఆంక్షలు తొలగింపు, డిజిటల్‌ ట్రేడ్‌ లావాదేవీలపై బ్యాంకు చార్జీల తగ్గింపు వంటి పలు చర్యలున్నాయి. 


దివాలా చర్యలకు విరామం

కంపెనీలపై దివాలా చర్యలు ప్రారంభించడానికి ఉన్న రుణ బకాయి పరిమితిని కోటి రూపాయలకు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఆ పరిమితి రూ.1 లక్ష ఉంది. ఈ చర్య వల్ల ఎంఎ్‌సఎంఈలు దివాలా ప్రక్రియ  ఎదుర్కొనడాన్ని గరిష్ఠంగా నివారించవచ్చునని ఆమె అన్నారు. 


ఇతర చర్యలు..

కార్పొరేట్‌ కంపెనీల డైరెక్టర్ల బోర్డు సమావేశాల నిర్వహణ నిర్బంధ కాలపరిమితి నిబంధనకు 60 రోజుల విరామం, విరామ సమయం ముగిసే వరకు ఆర్థిక ఫలితాల ప్రకటనలో జాప్యంపై పెనాల్టీ ఎత్తివేత


రూ.5 కోట్ల లోపు టర్నోవర్‌ గల ఎస్‌ఎంఈలు గత ఆర్థిక సంవత్సరానికి జీఎ్‌సటీ రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన తు ది గడువు మార్చి 31 నుంచి జూన్‌ చివరి వరకు పొడిగింపు


వివాద్‌ సే విశ్వాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ పథకాల గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు


ఐటీ చట్టం కింద పెట్టుబడి లాభాల పన్ను రోలోవర్‌ ప్రయోజనం పొందే పత్రాలు దాఖలు చేసే గడువు జూన్‌ 30 వరకు పెంపు


అడ్వాన్స్‌ టాక్స్‌, సెల్ఫ్‌ అసె్‌సమెంట్‌ టాక్స్‌, రెగ్యులర్‌ టాక్స్‌, టీడీఎస్‌, టీసీఎస్‌, ఎస్‌టీటీ చెల్లింపులో జాప్యానికి జూన్‌ 30 వరకు వడ్డీ రేటు 12/18 శాతం నుంచి 9 శాతానికి తగ్గింపు, జాప్యం సమయానికి లేట్‌ ఫీజులు, పెనాల్టీల నుంచి మినహాయింపు


పౌరులకు ఊరట ఇచ్చే చర్యలు

ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌పై చార్జీల ఎత్తివేత, ప్రైవేటు బ్యాంకులు సహా అన్ని బ్యాంకుల ఏటీఎంల్లోనూ మూడు నెలల పాటు ఉచిత విత్‌డ్రాయల్‌ సదుపాయం, పరిస్థితిని బట్టి ఈ సదుపాయం మరింత ఎక్కువ కాలం విస్తరించే అవకాశం


సేవింగ్స్‌ ఖాతాల్లో కనీస నిల్వ నిర్వహించాల్సిన నిబంధనకు మినహాయింపు, పెనాల్టీల ఎత్తివేత


2018-19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువు, పాన్‌-బయోమెట్రిక్‌ ఆధార్‌ అనుసంధానం గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు


ప్యాకేజీపై  టాస్క్‌ఫోర్స్‌ కృషి

ఆర్థిక వ్యవస్థ వర్తమాన స్థితిపై ప్రభుత్వం నిశితంగా దృష్టి కేంద్రీకరించిందని, ప్రధాని స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆమె చెప్పారు. ప్రధాని ప్రకటించిన మేరకు భిన్న శ్రేణులతో కూడిన కోవిడ్‌-19 ఎకనామిక్‌ టాస్క్‌ఫోర్స్‌ ప్యాకేజీపై చురుగ్గా కృషి చేస్తోందని నిర్మల చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌లో భాగమైన భిన్న ఉపవర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సవివరంగా విశ్లేషిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. అతి సమీపంలోనే ఆర్థిక ప్యాకేజి ప్రకటిస్తామని తెలిపారు.

Updated Date - 2020-03-25T06:40:17+05:30 IST