ఏటీఎంలే టార్గెట్..!

ABN , First Publish Date - 2021-06-24T15:37:13+05:30 IST

నగరంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో జరుగుతున్న వరుస చోరీలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేంద్రాల్లోని డిపాజిట్‌ యంత్రాల్లో ఇప్పటివరకు రూ.70 లక్షలు చోరీ జరిగినట్టు సమా చారం. దీనికి

ఏటీఎంలే టార్గెట్..!

- 22 ప్రాంతాల్లో రూ.70 లక్షల చోరీ

- హరియాణాలో ముగ్గురి అరెస్టు


చెన్నై: నగరంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో జరుగుతున్న వరుస చోరీలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కేంద్రాల్లోని డిపాజిట్‌ యంత్రాల్లో ఇప్పటివరకు రూ.70 లక్షలు చోరీ జరిగినట్టు సమా చారం. దీనికి సంబంధించి హర్యానాకు చెందిన ముఠాలోని ముగ్గురిని ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేయగా, ఇప్పటివరకు నమోదైన 7 కేసులు కేంద్ర క్రైం విభాగానికి బదిలీ అయ్యాయి. స్థానిక రామాపురం, విరుగంబాక్కం వళ్లువర్‌రోడ్డు, వేళచ్చేరి, తరమణి సహా ఏడు ప్రాంతాల్లోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోని డిపాజిట్‌ యంత్రాల్లో కొందరు ఆగంతకులు వినూత్న పద్ధతిలో నగదును చోరీ చేశారు. ఈ వ్యవహారంపై రామాపురం ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు ఆ ఏటీఎం కేంద్రంలోని సీసీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు వ్యక్తు లు నగదు చోరీ చేసినట్టు గుర్తించారు. అదే రీతిలో మిగిలిన కేంద్రాల్లో కూడా నగదు అపహరణకు గురైంది. ఒకే బ్యాంకుకు చెందిన ఏటీఎంల్లో మాత్రమే ఇలా చోరీలు జరగడం బ్యాంకు వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఈ చోరీలకు సంబంధించి ఎస్‌బీఐ చెన్నై మండల జనరల్‌ మేనేజర్‌ ఆర్‌.రాధాకృష్ణ బుధవారం నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ తో సమావేశమై చర్చించారు. అనంతరం కమిషనర్‌ మీడియాతో మాట్లా డుతూ... రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.48 లక్షలు నష్టపోయినట్టు 19 ఫిర్యా దులు అందాయన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన ఉత్తరాదికి చెందిన నలు గురిని గుర్తించామన్నారు. ఈ కేసుల విచారణకు వెస్ట్‌ మండల అదనపు కమిషనర్‌ కన్నన్‌ నేతృత్వంలోని ఏర్పాటైన రెండు ప్రత్యేక బృందాలు హరియాణా చేరుకొని విచారణ జరిపి మేవాక్‌ జిల్లాలో ఉన్న ముగ్గురు నిందితులను పట్టుకున్నాయని, మరొకరి కోసం గాలిస్తున్నాయని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులను నగరానికి తీసుకురానున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది, ఏటీఎంలో నగదు నింపే సంస్థల సిబ్బంది పాత్రపై కూడా దృష్టి సారించామని వివరించారు.   కాగా ఇప్పటివరకు నగరంలోని 22 ప్రాంతాల్లోని తమ ఏటీఎం కేంద్రాల్లో సుమారు రూ.70 లక్షల వరకు చోరీకి గురైనట్టు గుర్తించామని ఎస్బీఐ జీఎం తెలిపారు.

Updated Date - 2021-06-24T15:37:13+05:30 IST