పక్కా ప్లానింగ్‌తో ఏటియంలో డబ్బులు నింపాల్సిన ఉద్యోగులే.. కోటిన్నర కాజేశారు!

ABN , First Publish Date - 2022-05-26T11:01:36+05:30 IST

సిటీలోని పలు ఏటీయంలలో డబ్బులు నింపాల్సిన ఇద్దరు ఉద్యోగులు.. ఆయా ఏటియంలలో పూర్తిగా డబ్బు నింపకుండా కాజేశారు. ఇలా మొత్తం రూ.కోటిన్నర డబ్బులు దొంగిలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భిండీ జిల్లాలో...

పక్కా ప్లానింగ్‌తో ఏటియంలో డబ్బులు నింపాల్సిన ఉద్యోగులే.. కోటిన్నర కాజేశారు!

సిటీలోని పలు ఏటీయంలలో డబ్బులు నింపాల్సిన ఇద్దరు ఉద్యోగులు.. ఆయా ఏటియంలలో పూర్తిగా డబ్బు నింపకుండా కాజేశారు. ఇలా మొత్తం రూ.కోటిన్నర డబ్బులు దొంగిలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భిండీ జిల్లాలో వెలుగు చూసింది. 


భిండీ జిల్లాలోని సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ అనే కంపెనీ కొన్ని ఏటియంలలో డబ్బులు నింపే పని చేస్తుంది. ఈ క్రమంలోనే ఆశిష్, సత్యేంద్ర అనే ఇద్దరు ఉద్యోగులను ఈ పనికి పురమాయించారు. అయితే వీళ్లిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చి తాము డబ్బు నింపాల్సిన ఏటియంలో పూర్తిగా డబ్బులు నింపకుండా కొంత డబ్బు కాజేయడం మొదలు పెట్టారు. 


ఇలా సుమారు పదిహేను ఏటీయంలలో కొంత కొంత చొప్పున రూ.కోటిన్నర పైగా కాజేశారు. బ్యాంకు ఆడిట్ సమయంలో ఈ లెక్కలు బయట పడ్డాయి. డబ్బు లెక్కల్లో తేడా కనిపించడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-05-26T11:01:36+05:30 IST