ATM Cash Withdrawal: ఏటీఎం వినియోగదారులకు బ్యాంకుల షాక్

ABN , First Publish Date - 2022-08-17T14:49:24+05:30 IST

ఏటీఎం వినియోగదారులకు పలు బ్యాంకులు షాక్ ఇచ్చాయి...

ATM Cash Withdrawal: ఏటీఎం వినియోగదారులకు బ్యాంకుల షాక్

ముంబయి: ఏటీఎం వినియోగదారులకు పలు బ్యాంకులు షాక్ ఇచ్చాయి. ఏటీఎంలలో ప్రతీ ఆర్థిక లావాదేవీకి 17 రూపాయలు,(ATM Cash Withdrawal)ఆర్థికేతర లావాదేవీలకు 6రూపాయలు వసూలు చేయాలని పలు బ్యాంకులు(Major Banks) నిర్ణయించాయి.ఈ ఏడాది ఆగస్టు 1వతేదీ నుంచి ఏటీఎం(ATM) కేంద్రాల్లో వినియోగదారుల జరిపే లావాదేవీలకు రుసుమును(Charges) విధించడానికి బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(RBI) అనుమతించింది.పెరుగుతున్న ఏటీఎం స్థాపన, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా బ్యాంకులు ఖాతాదారుల నుంచి సర్వీస్ ఛార్జీలను(banks collect ATM service charges) వసూలు చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి.


బ్యాంకు ఖాతాదారులకు(Customers) ఉన్న ఏటీఎం కార్డు రకాన్ని బట్టి అన్ని ప్రధాన బ్యాంకులు డెబిట్ కార్డ్‌లు లేదా ఏటీఎం కార్డులపై వార్షిక రుసుమును కూడా వసూలు చేస్తాయి.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB),హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్,ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్,యాక్సిస్ బ్యాంలు వివిధ రకాల ఏటీఎం ఛార్జీలు విధిస్తున్నాయి. నెలవారీ ఉచిత పరిమితికి మించి ఏటీఎంలలో (ATM)లో జరిపే ప్రతి అదనపు లావాదేవీకి 21 రూపాయల ఛార్జ్ విధించడానికి బ్యాంకులకు ఈ ఏడాది జనవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అనుమతించింది.


ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా పరిమిత సంఖ్యలో ఏటీఎంలలో ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్నాయి. ఉచిత నెలవారీ లావాదేవీల పరిమితికి మించి ఏటీఎంలను ఉపయోగిస్తే బ్యాంకులు ఛార్జీ విధించనున్నాయి.కస్టమర్‌లు ప్రతి నెలా వారి బ్యాంక్ ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలను అనుమతిస్తారు ఇతర బ్యాంక్ ఏటీఎంలకు పరిమితి మూడు ఉచిత లావాదేవీలు. నాన్-మెట్రో కేంద్రాల్లోని కస్టమర్లు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు సాగించవచ్చు.


 ప్రధాన బ్యాంకులు డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ చార్జీలు క్లాసిక్ డెబిట్ కార్డుకు 125రూపాయలు ప్లస్ జీఎస్‌టీ వసూలు చేస్తాయి.సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై 125రూపాయలు ప్లస్ జీఎస్‌టీ వసూలు చేస్తాయి.యువ, గోల్డ్ కార్డుకు 175 రూపాయలు,ప్లస్ జీఎస్‌టీ, కాంబో, మై కార్డు ప్లస్ డెబిట్ కార్డులపై 250 రూపాయలు వార్షిక నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తాయి.ప్లాటినం, ప్రైడ్, ప్రీమియం, బిజినెస్ డెబిట్ కార్డులపై 350 రూపాయలు ప్లస్ జీఎస్‌టీని వసూలు చేయనున్నాయి.డెబిట్ కార్డు రీ ప్లేస్ మెంటు చార్జీలు 300రూపాయలు ప్లస్ జీఎస్‌టీ, డూప్లికేట్ పిన్, పిన్ రీజనరేషన్ చేసినా 50 రూపాయల చార్జీతోపాటు జీఎస్‌టీని బ్యాంకులు విధించనున్నాయి.



Updated Date - 2022-08-17T14:49:24+05:30 IST