Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏటీఎం కార్డు దొంగిలించి సొమ్ము కాజేసిన వ్యక్తికి జైలు

ముమ్మిడివరం, డిసెంబరు 3: ఏటీఎం కార్డును తస్కరించి రూ.80వేలు కాజేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష పడింది. ముమ్మిడివరం టీటీఆర్‌ నగర్‌కు చెందిన చెరుకూరి వెంకటసూర్యప్రకాష్‌ 2020 నవంబరు 28న ముమ్మిడివరం లంకతల్లమ్మ గుడిసెంటర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదును తీసుకోవడానికి ప్రయత్నించినా రాలేదు. అక్కడే ఉన్న ఐ.పోలవరానికి చెందిన పళ్ల సురేంద్రకుమార్‌ తాను ప్రయత్నిస్తానని పిన్‌నెంబరు తెలుసు కు ని ఏటీఎం కార్డును కాజేశాడు. ఆ కార్డుతో నగల దుకాణంలోకి వెళ్లి రూ.80 వేలు విలువైన బంగారు నగలు కొనుగోలుచేశాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్ప టి ఎస్‌ఐ కె.నాగార్జున కేసునమోదు చేశారు. నేరంరుజువు కావడంతో ముమ్మిడివరం జూనియర్‌ సివిల్‌జడ్జి ఎస్‌.శ్రీనివాస్‌ ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పుచెప్పినట్టు ఎస్‌ఐ కె.సురేష్‌బాబు తెలిపారు. ఈకేసునుఏపీపీ జి.విజయ్‌ వాదించారు. Advertisement
Advertisement