పీఎ‌స్‌ఎల్‌వీ మిషన్‌లో ఏటీఎల్‌!

ABN , First Publish Date - 2021-02-28T09:42:03+05:30 IST

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌(పీఎ్‌సఎల్‌వీ).. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత కీలకమైనది, నమ్మకమైనది.

పీఎ‌స్‌ఎల్‌వీ మిషన్‌లో ఏటీఎల్‌!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌(పీఎ్‌సఎల్‌వీ).. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ఉపగ్రహ ప్రయోగాల్లో అత్యంత కీలకమైనది, నమ్మకమైనది. ప్రతిష్ఠాత్మకమైన పీఎ్‌సఎల్‌వీ మిషన్‌లో హైదరాబాద్‌కు చెందిన ‘అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌)’ భాగస్వామిగా ఉంది. ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎ్‌సఎ్‌ససీ)తో ఏటీఎల్‌కు సుదీర్ఘకాలంగా ఒప్పందం ఉంది. వీఎ్‌సఎ్‌ససీ ఇంజనీర్ల బృందాల మార్గదర్శకత్వంలో పనిచేస్తోంది. ఏటీఎల్‌ వివిధ ఫ్లైట్‌ సిస్టంలు, దశలు, వాటి టెస్టింగ్‌లను చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ పావులూరి సుబ్బారావు తెలిపారు. కీలకమైన పీఎ్‌సఎల్‌వీ మిషన్‌లో తొలిసారిగా భారతీయ ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థ అయిన ఏటీఎల్‌ సేవలను వినియోగించుకుంటోందని వెల్లడించారు. అంతరిక్ష రంగంలో కీలకమైన కార్యకలాపాల్లో స్వదేశీ ప్రైవేటు పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ఇస్రో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఇది నిదర్శనమని తెలిపారు. ఏటీఎల్‌ మూడు దశాబ్దాలుగా ఇస్రోకు నమ్మకమైన భాగస్వామిగా పనిచేస్తోందన్నారు. తమ సంస్థను విశ్వసిస్తున్న, ప్రోత్సహిస్తున్న ఇస్రోకు సుబ్బారావు ధన్యావాదాలు తెలియజేశారు. ఇస్రోకు సంబంధించిన వాహకనౌకలు, ఉపగ్రహాలు, స్పేస్‌క్రాఫ్ట్‌ పేలోడ్లు, గ్రౌండ్‌ సిస్టమ్స్‌లకు అవసరమైన ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌ సబ్‌ సిస్టమ్‌లను ఏటీఎల్‌ తయారు చేస్తోందని వివరించారు.




కీలకమైన ఏరోస్పేస్‌ సబ్‌ సిస్టమ్‌లను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. సంస్థ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉందని, కేరళలోని తిరువనంతపురంలో ప్రత్యేక కేంద్రం ఉందని చెప్పారు. అక్కడి నుంచి ఇస్రోకు ఫ్యాబ్రికేషన్‌, అసెంబ్లీ, టెస్టింగ్‌, అత్యాధునిక ఎలకా్ట్రనిక్‌ ప్యాకేజీల సరఫరా, కంప్యూటర్‌ సిస్టమ్స్‌, వాహక నౌకలకు చెందిన వివిధ సబ్‌ సిస్టమ్స్‌ తయారీలో అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. బెంగళూరులో స్పేస్‌క్రాఫ్ట్‌ తయారీకి గాను భారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తాము దాదాపు 30 ఏళ్లలో ఇస్రోకు చెందిన 66 వాహకనౌకలు, 88 స్పేస్‌క్రా్‌ఫ్టలకు ఎలాంటి లోపాలు లేని పరికరాలను తయారు చేసి అందించినట్లు సుబ్బారావు తెలిపారు. ఐరోపా, అమెరికా, రష్యాలకు చెందిన ప్రముఖ ఏరోస్పేస్‌ కంపెనీలతోనూ ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. తాజాగా అమెరికాకు చెందిన శాటర్న్‌ శాటిలైట్‌ నెట్‌వర్క్స్‌ (ఎస్‌ఎస్ఎన్‌)తో అత్యాధునికమైన ఉపగ్రహాల (సూక్ష్మ-మధ్య పరిమాణం) తయారీకి సంబంధించి సంయుక్త వెంచర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఉపగ్రహాలు భారత్‌ ప్రయోగించనున్న పీఎ్‌సఎల్‌వీ, ఎస్‌ఎ్‌సఎల్‌వీలకు సరిపోతాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఏటీఎల్‌ దేశ అంతరిక్ష కార్యకలాపాల్లో ఇస్రోతో కలిసి మరింత సమర్థంగా పనిచేస్తుందని సుబ్బారావు తెలిపారు. 

Updated Date - 2021-02-28T09:42:03+05:30 IST