ఆత్మకూరు ఉప ఎన్నికలో అదే జరగనుందా..?

ABN , First Publish Date - 2022-06-06T05:19:03+05:30 IST

నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఉపఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఇప్పటికే

ఆత్మకూరు ఉప ఎన్నికలో అదే జరగనుందా..?

ఆత్మకూరు, జూన్‌ 5 : నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఉపఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ సోమవారంతో ముగియనుంది. ఇప్పటికే 16 నామినేషన్లు ధాఖలయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి ఎందరో ఉద్ధండులు పోటీ చేసి తమ రాజకీయ భవితకు బాటలు వేసుకున్నారు. అయితే మహిళలకు మాత్రం ఆత్మకూరు నుంచి పోటీ చేసే అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు జరిగే ఉపఎన్నికల్లో సైతం ఏ రాజకీయ పార్టీ సీటు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. నియోజకవర్గంలో పురుషుల కన్నా మహిళలకే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలకు ప్రాధాన్య మంటూ ప్రసంగాలు చేప్పే పార్టీల నాయకులు దశాబ్ధాల తరబడి ఆత్మకూరు అసెంబ్లీ నుంచి మహిళలకు సీటిచ్చేందుకు ఏ పార్టీ చొరవచూపకపోవడం గమనార్హం. 

1955 నుంచి...

 జిల్లాలో ఇప్పటివరకు 16 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారి కూడా ఆత్మ కూరు అసెంబ్లీ నుంచి ఏ రాజకీయ పార్టీ మహిళను పోటీకి నిలబెట్టిన దాఖలాలు లేవు.  రాష్ట్ర చరిత్రలో 1955 నుంచి 2019 వరకు జరిగిన ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు మగువ వాణి వినిపించే అవకాశం దక్కలేదు. ముఖ్యంగా 12 సార్లు గెలిచిన కాంగ్రెస్‌, రెండు సార్లు గెలిచిన వైసీపీ, నాలుగు సార్లు పోటీ చేసిన టీడీపీ, మూడు సార్లు పోటీ చేసిన బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు టికెట్‌ కేటాయించలేదు. 1955లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన గంగా చిన్నకొండయ్య అసెంబ్లీలో తన వాణిని వినిపించారు. 1958, 1962లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆనం సంజీవరెడ్డి, 1967లో ఎస్‌డబ్ల్యుఏ నుంచి పెళ్ళకూరు రామచంద్రారెడ్డి, 1972లో కాంగ్రెస్‌ అభ్యర్థి కంచర్ల శ్రీహరినాయుడు, 1978, 1985, 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డి, 1983లో టీడీపీ అభ్యర్థి ఆనం వెంకటరెడ్డి, 1994, 2004లో టీడీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు, 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్య, 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి, 2014, 2019లో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు. 


Updated Date - 2022-06-06T05:19:03+05:30 IST