రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులు

ABN , First Publish Date - 2022-10-05T05:50:21+05:30 IST

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 11 పతకాలు కైవసం చేసుకోగా వీటిలో ఏడు బంగారు పతకాలు వున్నాయి. నెల్లూరులో గత నెల 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు 4వ ఏపీ తైక్వాండో పోటీలు జరిగాయి.

రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తాచాటిన క్రీడాకారులు
బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు

 ఏడు బంగారు, రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు

ఎలమంచిలి, అక్టోబరు 4: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఎలమంచిలి క్రీడాకారులు సత్తా చాటారు. మొత్తం 11 పతకాలు కైవసం చేసుకోగా వీటిలో ఏడు బంగారు పతకాలు వున్నాయి. నెల్లూరులో గత నెల 29 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు 4వ ఏపీ తైక్వాండో పోటీలు జరిగాయి. ఎలమంచిలి నుంచి 14 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సబ్‌ జూనియర్స్‌ బాలికల విభాగంలో ఎం.హర్షిత, జూనియర్స్‌ విభాగంలో తుంపాల శ్వేత, రొట్టా పల్లవి, ఉండా జయశ్రీ, ఉండా మౌనిక, బాలుర విభాగంలో నగిరెడ్డి మోహిత్‌, ఆర్‌.విష్ణువర్దన్‌ బంగారు పతకాలు సాధించారు. ఎల్‌.లహరి, వి.నంద కృష్ణ రజత పతకాలు, వై.జశ్వంత్‌, వి.సౌజన్య కాంస్య పతకాలు పొందారు. పోటీల్లో 14 మంది క్రీడాకారులు పాల్గొనగా 11 మంది పతకాలు సాధించారని తైక్వాండో జిల్లా కోచ్‌ నగిరెడ్డి సత్యనారాయణ తెలిపారు. 


Updated Date - 2022-10-05T05:50:21+05:30 IST