క్రీడాకారులను అభినందిస్తున్న గోగు వెంకటనారాయణరెడ్డి
కేశంపేట/కందుకూరు/ఆమనగల్లు, జనవరి 24: గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వంతో పాటు క్రీడాభిమానులు ముందుకు రావాలని కేశంపేట మండలం లేమామిడి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గోగు వెంకటనారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. మండల క్రికెట్ టీం ఆదివారం షాద్‌నగర్ పట్టణంలో గోగు నారాయణరెడ్డి నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల్లో షాద్‌నగర్ నియోజకవర్గం విజేతగా నిలిచింది. ఈమేరకు టీం సభ్యులకు సోమవారం గోగు వెంకటనారాయణరెడ్డి అభినందించారు. అనంతరం టీం సభ్యులు గోగు వెంకటనారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కందుకూరు పరిధి అన్నోజిగూడలో 10 రోజుల పాటు నిర్వహించిన ప్రీమియర్‌లీగ్ క్రికెట్ పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. ఇందులో విజేతలకు సర్పంచులు కాకి ఇందిరదశరథ, పోలెమోని శ్రీలతశ్రీహరిలు బహుమతులు అందజేశారు. వార్డు సభ్యులు రఘురాంరాథోర్డు, కాకి గిరీష్, కాకి సదానంద్‌ముదిరాజ్, కాకి నందీశ్వర్, నాయకులు గణేష్, ఎడ్ల అరుణ, సురేష్, ఆంజనేయులు, శివకుమార్, కె.శివకృష్ణ, ఎ.శ్రీశైలం, విజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు మండలంలోని రాంనుంతల గేటు వద్ద నాలుగు రోజుల పాటు నిర్వహించిన తాలూకా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ సోమవారం ముగిసింది. ముగింపు వేడుకలకు సర్పంచ్ సోన శ్రీనునాయక్, ఎంపీటీసీ సరిత పంతూనాయక్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతజట్లకు మొదటి బహుమతి రూ.10వేలు, రెండవ బహుమతి రూ.5వేల నగదు, షీల్డ్‌లను బహూకరించారు. యువత, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు కృష్ణ, ఆంజనేయులు, జగ్గు, లక్ష్మయ్య, అరవింద్, రమేశ్, వినోద్, రాజు, గోపి, భాస్కర్, జగన్, వినోద్, రాజేందర్, సంతోష్ పాల్గొన్నారు.