క్రీడాకారులు ఉన్నతస్థాయికి ఎదగాలి : మంత్రి ఐకేరెడ్డి

ABN , First Publish Date - 2022-05-27T07:00:17+05:30 IST

బ్యాట్మెంటన్‌ క్రీడలో శిక్షణ పొందిన క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర ఉన్నతస్థాయికి ఎదగాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు.

క్రీడాకారులు ఉన్నతస్థాయికి ఎదగాలి : మంత్రి ఐకేరెడ్డి
విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, మే 26 : బ్యాట్మెంటన్‌ క్రీడలో శిక్షణ పొందిన క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర ఉన్నతస్థాయికి ఎదగాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు. గురువారం ఆయన నిర్వహించిన వేసవి శిక్ష ణ ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పిల్లల తల్లి దండ్రులు వారిలో ఉన్న ఆసక్తి గురించి వేసవిశిక్షణ ఇప్పించడం అభినంద నీయమన్నారు. చదువుతో పాటు ఇతర రంగాల్లో పిల్లలు రాణించాలన్నారు. శిక్షణ ఇచ్చిన పీఈటీలను సన్మానించారు. బాలికల సీనియర్స్‌ విభాగంలో కొండూరు వంశిక మంత్రి నుంచి ప్రథమ బహుమతి అందుకున్నారు. జూని యర్‌ విభాగంలో అడపా తపస్వి, శృతిక బహుమతి అందుకోగా రాష్ట్ర స్థాయిలో హైజంప్‌ పోటీల్లో గోల్డ్‌మెడల్‌ సాధించిన రాథోడ్‌ సందీప్‌ను మంత్రి శాలువాతో సన్మానించి అభినందించారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, మాజీ సీసీసీబీ చైర్మన్‌ రామ్‌కిషన్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్‌ సలీం, పూదరి నరహరి, మాజీ కౌన్సిలర్‌ దయాకర్‌రెడ్డి, డాక్టర్‌ దేవేందర్‌రెడ్డి, కోచ్‌ భూమన్న, రాజేశ్వర్‌, మాణిక్యం, కృష్ణ, భరత్‌, డీవైఎస్‌వో వినోద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T07:00:17+05:30 IST