Tokyo Olympics: ఆటగాళ్లకు ‘యాంటీ సెక్స్ బెడ్స్’

ABN , First Publish Date - 2021-07-20T01:56:05+05:30 IST

ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు కార్డ్‌బోర్డుః‌తో తయారు చేసిన ‘యాంటీ-సెక్స్’ (శృంగారానికి పనికిరాని)

Tokyo Olympics: ఆటగాళ్లకు ‘యాంటీ సెక్స్ బెడ్స్’

టోక్యో: ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు కార్డ్‌బోర్డుః‌తో తయారు చేసిన ‘యాంటీ-సెక్స్’ (శృంగారానికి పనికిరాని) బెడ్స్ ఏర్పాటు చేసినట్టు వచ్చిన వార్తలపై కలకలం రేగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ నవ్వుపుట్టిస్తున్నారు. 


ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనకుండా ఉండేందుకు కావాలనే ఈ బెడ్స్‌ను తయారు చేయించారన్న ఆరోపణలపై నిర్వాహకులు స్పందించారు. గేమ్స్ ముగిసిన తర్వాత రీసైకిల్ చేసి పేపర్ ఉత్పత్తులుగా మార్చాలన్న ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేసినప్పటికీ, శృంగారానికి పనికి రావని చెప్పడం సరికాదని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒక్కో బెడ్ 200 కిలోల బరువు వరకు మోయగలవని పేర్కొన్నారు. ‘యాంటీ సెక్స్ బెడ్స్’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.


కరోనా నేపథ్యంలో ఆటగాళ్లు ఒకరితో ఒకరు కలవకుండా, శృంగారంలో పాల్గొనకుండా ఉండేందుకు తక్కువ సామర్థ్యం ఉన్న కార్డుబోర్డు మంచాలను ఏర్పాటు చేశారంటూ అమెరికా అథ్లెట్ ఒకరు మంచాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి ‘యాంటీ సెక్స్ బెడ్స్’ అంటూ ప్రచారం మొదలైంది. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనుకున్నప్పుడు అసలు క్రీడలే నిర్వహించడం మానేస్తే పోయేది కదా అంటూ నెటిజన్లు ఫైరయ్యారు. దీంతో స్పందించిన ఒలింపిక్స్ నిర్వాహకులు బెడ్లపై స్పష్టత ఇచ్చారు.


మరోవైపు, ఇవి యాంటీ సెక్స్ బెడ్స్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐర్లాండ్ జిమ్నాస్ట్ రిస్ మెక్‌క్లెనఘన్ స్పందించాడు. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని చెప్పేందుకు ఓ బెడ్‌పై బలంగా ఎగురుతూ అవి గట్టిగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.



Updated Date - 2021-07-20T01:56:05+05:30 IST