రైతు బిడ్డకు ప్రపంచ పతకం

ABN , First Publish Date - 2022-08-06T10:10:42+05:30 IST

భారత్‌కు చెందిన అథ్లెట్‌ రూపాలి చౌధరి వరల్డ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం సాధించింది.

రైతు బిడ్డకు ప్రపంచ పతకం

కాలి (కంబోడియా): భారత్‌కు చెందిన అథ్లెట్‌ రూపాలి చౌధరి వరల్డ్‌ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో కాంస్యం సాధించింది. గురువారం జరిగిన మహిళల 400మీ. పరుగులో తను 51.85సె. టైమింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ప్రస్తుత టోర్నీలో రూపాల్‌ ఇదివరకే 4్ఠ400 మిక్స్‌డ్‌ రిలే టీమ్‌ ఈవెంట్‌లో రజతం అందుకోవడం విశేషం. పట్టికలో భారత్‌ ఓ రజతం, కాంస్యంతో 17వ స్థానంలో కొనసాగుతోంది. యూపీలోని మీరట్‌ ప్రాంతానికి చెందిన రూపాల్‌ తండ్రి ఓ రైతు. చిన్నప్పుడు తన ఊరి నుంచి మీరట్‌లోని స్టేడియానికి తీసుకెళ్లేందుకు మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేసి తండ్రి దగ్గర పంతం నెగ్గించుకుంది.


ఆ తర్వాత అథ్లెటిక్స్‌పై దృష్టి సారించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇదే పోటీల్లో మహిళల 4్ఠ400 రిలేలో భారత జట్టు ఫైనల్‌ చేరి సంచలనం సృష్టించింది. హీట్స్‌లో సుమ్మి, ప్రియా మోహన్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుంజ రజిత, రుపాల్‌ బృందం 3 నివిషాల 34.18 సెకన్లలో రేసును పూర్తి చేసింది. ఫిన్‌లాండ్‌ టాప్‌లో నిలవగా నైజీరియా మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం ఫైనల్‌ జరగనుంది.

Updated Date - 2022-08-06T10:10:42+05:30 IST