‘నేను ఆ పని చేయలేదు’ అంటూ క్రీడాకారుడు ఆత్మహత్య!

ABN , First Publish Date - 2022-06-29T15:50:19+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో...

‘నేను ఆ పని చేయలేదు’ అంటూ క్రీడాకారుడు ఆత్మహత్య!

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో వర్ధమాన క్రీడాకారుడు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. రాయ్‌పూర్ పరిధిలోని నాగ్లీ గ్రామానికి చెందిన 23 ఏళ్ల రాహుల్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు చెట్టుపై నుంచి మృతదేహాన్ని కిందకు దించారు. అతని జేబులో సూసైడ్ నోట్ దొరికింది. పోలీసులు నోట్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. రాహుల్ ఎదుగుతున్న అథ్లెట్. చిన్న వయసులోనే దేశ విదేశాల్లో ఎన్నో పతకాలు సాధించాడు. ఢిల్లీలో ఉంటూ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ బాలికను ప్రలోభపెట్టి తీసుకెళ్లాడని రాహుల్‌పై ఆమె బంధువులు అత్యాచారం కేసు పెట్టారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు రాహుల్‌ను అతని గ్రామంలో అరెస్టు చేశారు. దాదాపు 19 నెలల పాటు జైలులో ఉన్న అతడు నెల రోజుల క్రితమే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి డిప్రెషన్‌లో కూరుకుపోయాడు. 


రాహుల్ తన సూసైడ్ నోట్‌లో ‘‘నా జీవితం నిరుపయోగంగా మారింది. తప్పుడు కేసులో ఇరికించి జైలుకు వెళ్లినప్పటి నుంచి డిప్రెషన్‌లో కూరుకుపోయాను. నేనేమీ తప్పు చేయలేదు. ఆ అమ్మాయి నా స్నేహితురాలు మాత్రమే. అమ్మాయి తల్లిదండ్రులు నాపై  అత్యాచార ఆరోపణలు చేస్తూ జైలుకు పంపారు. 19 నెలలు జైల్లో ఉండడం వల్ల నా జీవితం నాశనమైంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందలేకపోతున్నాను. జైలుకు వెళ్లిన తర్వాత చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. అందుకే ఈ అడుగు వేస్తున్నాను. నన్ను క్షమించండి. ఇందులో నా తప్పు లేదు. నాన్నా నన్ను క్షమించు.. పెద్ద అథ్లెట్ కావాలనేది నా కల. నేను కూడా కష్టపడ్డాను. దేశ విదేశాల్లో ఎన్నో పతకాలు సాధించినా నా జీవితం నాశనం అయిపోయింది. నేను అత్యాచారం చేయలేదు. తనకు ఏమీ జరగలేదని ఆ అమ్మాయి కూడా చెప్పింది. అయినా నాకు శిక్ష పడింది. ఈ కళంకంతో నేను జీవించలేను. అందరూ నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను ఎవరితోనూ మాట్లాడలేకపోయాను. అందుకే నా జీవితాన్ని ముగించుకుంటున్నాను. క్షమించండి’’ అని రాశాడు. రాహుల్ చాలా డిప్రెషన్‌లో ఉన్నాడని ఆయన తండ్రి ముఖేష్ కుమార్ తెలిపారు. డబ్బు కోసం బాలిక తల్లిదండ్రులు ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నెల రోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఢిల్లీలో ఉంటూ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో, ముజఫర్‌నగర్‌లోని ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2022-06-29T15:50:19+05:30 IST