అతిసారపై దర్యాప్తు

ABN , First Publish Date - 2021-04-13T05:26:23+05:30 IST

పట్టణంలోని అరుణ్‌జ్యోతినగర్‌లో తాగునీటి కలుషితం కారణంగా 130 మందికి అతిసార సోకిన విషయం తెలిసిందే.

అతిసారపై దర్యాప్తు
విచారణ జరుపుతున్న కమిటీ సభ్యులు

  1. చెరువులు, ఫిల్టర్‌ బెడ్లను  పరిశీలించిన కమిటీ సభ్యులు
  2. నీటి నమూనాల సేకరణ


ఆదోని టౌన్‌, ఏప్రిల్‌ 12: పట్టణంలోని అరుణ్‌జ్యోతినగర్‌లో తాగునీటి కలుషితం కారణంగా 130 మందికి అతిసార సోకిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం సాయంత్రం విచారణ ప్రారంభించారు. కన్వీనర్‌ ఆర్డీవో రామకృష్ణారెడ్డి, సభ్యులు అనంతపురం, కర్నూలుకు చెందిన పబ్లిక్‌హెల్త్‌ ఈఈలు సురేంద్ర, శ్రీనాథ్‌రెడ్డి రాంజల, బసాపురం చెరువులను, ఫిల్టర్‌బెడ్స్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంకులను పరిశీలించారు. తాగునీటి నమూనాలను సేకరించారు. బాధితులను కలిసి తాగునీటిపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాగునీటి నమూనాలను విజయవాడ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు, రిపోర్టు రాగానే ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణ, ఎంఈ సత్యనారాయణ, నీటి విభాగం సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T05:26:23+05:30 IST