IIITMలో ఎంబీఏ

ABN , First Publish Date - 2022-07-04T20:46:39+05:30 IST

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని అటల్‌ బిహారీ వాజపేయి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌(ఏబీవీ - ఐఐఐటీఎం), గ్వాలియర్‌ - ఎంబీఏ, ఎంబీఏ

IIITMలో ఎంబీఏ

కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని అటల్‌ బిహారీ వాజపేయి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌( Atal Bihari Vajpayee Indian Institute of Information Technology and Management)(ఏబీవీ - ఐఐఐటీఎం), గ్వాలియర్‌ - ఎంబీఏ, ఎంబీఏ(బిజినెస్‌ అనలిటిక్స్‌) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సెకండ్‌ ఫేజ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్లు. నిర్దేశిత జాతీయ పరీక్ష స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.


అర్హత: ఇంజనీరింగ్‌/ టెక్నాలజీ విభాగాల్లో ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ స్థాయిలో మేథమెటిక్స్‌ / స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి మాస్టర్స్‌ డిగ్రీ(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ సైన్స్‌/ ఆపరేషన్‌ రిసెర్చ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఎకనామిక్స్‌/ కామర్స్‌) పూర్తిచేసినవారు కూడా అర్హులే. ఏ కోర్సులోనైనా ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. క్యాట్‌/ మ్యాట్‌/ సీమ్యాట్‌/ జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ తప్పనిసరి.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.2,000; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 13

గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ: జూలై 21

వెబ్‌సైట్‌: iiitm.ac.in

Updated Date - 2022-07-04T20:46:39+05:30 IST