Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఘనంగా ప్రారంభమైన 'ఆటా' వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు

twitter-iconwatsapp-iconfb-icon
ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు

వాషింగ్టన్ డీసీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో 17వ ఆటా  కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కిక్ ఆఫ్ మీటింగ్ వాషింగ్టన్ డీసీలో శనివారం ఘనంగా జరిగింది. హెర్నడోన్ నగరంలో క్రౌన్ ప్లాజా హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. మొట్ట మొదటి సారిగా ఆటా కాన్ఫరెన్స్ అమెరికా రాజధానిలో 2022 సంవత్సరంలో జులై 1,2,3 తారీకులలో వాల్టర్ యీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించునున్నారు. కేపిటల్ ఏరియా తెలుగు సంఘం కాట్స్ కో-హోస్ట్‌గా వ్యవహిరిస్తోంది. శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆటా 17వ మహా సభల థీమ్ సాంగ్, లోగోను ఆవిష్కరించారు.


ఆటా జాయింట్ సెక్రటరీ రామకృష్ణ ఆలా సభ కార్యక్రమాలకు అతిథుల్ని ఆహ్వానించారు. ఎంబసీ అఫ్ ఇండియా కౌన్సిలర్ అన్షుల్ శర్మ ముఖ్య అతిధిగా విచ్చేసారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా అమెరికాలో భారత సంతతి వారికి సేవ చేయడంలో ఆటా సంస్థ ముందంజలో ఉందని ఆయన కొనియాడారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కమిటీలు ప్రకటించారు. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాల పారంభోపన్యాసం చేస్తూ కోవిడ్-19 మహమ్మారి తర్వాత అందరిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మొట్ట మొదటిసారిగా డీసీలో కనెన్షన్ నిర్వహిస్తున్నామని, అమెరికా సంయుక్త దేశాల తెలుగు వారు ఇందులో విరివిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమంలో 12,000 మందికి పైగా తెలుగు వారు పాల్గొనడానికి కావలిసిన అన్ని సౌకర్యాలు కల్పించటానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 

ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు

ఆటా అధ్యక్షుడిగా ఎన్నికైన మధు బొమ్మినేని మహిళలు కాన్ఫరెన్స్‌లో ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయ్యాలని కోరారు. ఆటా 17వ మహా సభల కన్వీనర్‌గా సుధీర్ బండారు, కోఆర్డినేటర్‌గా కిరణ్ పాశం, కాన్ఫరెన్స్ డైరెక్టర్‌గా కేకే రెడ్డి, కో-కన్వీనర్‌గా సాయి సుదిని, కో-కోర్డినేటర్‌గా రవి చల్ల, కో-డైరెక్టర్‌గా రవి బొజ్జ, కాట్స్ ప్రెసిడెంట్ సుధా కొండపు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. అడ్వైజరీ కమిటీ చైర్‌గా జయంత్ చల్ల, రీజినల్ కోఆర్డినేటర్‌గా శ్రావణ్ పాదురు వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా 70 కమిటీలను ప్రకటించారు. డీసీ తెలుగు కమ్యూనిటీలో ఎంతో మంది ప్రముఖమైన వ్యక్తులను ఈ కమిటీలలో సభ్యులుగా ప్రకటించారు.

ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు

17వ మహా సభల కన్వీనర్ సుధీర్ బండారు వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల లోని తెలుగు వారందరు కాన్ఫరెన్స్ గొప్పగా నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించవలిసిందిగా అభ్యర్ధించారు. కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ కిరణ్ పాశం మాట్లాడుతూ ఆటా తెలుగు సంస్కృతి పరిరక్షణతో పటు ఎన్నో సేవ కార్యకమాలు కూడా నిర్వహిస్తోంది అని తెలియచేసారు. కాన్ఫరెన్స్ డైరెక్టర్ కృష్ణ రెడ్డి  మాట్లాడుతూ ప్రారంభ సమావేసంలోనే  మందికి పైగా తెలుగు పాల్గొనటం శుభసూచకం అని కొనియాడారు. అడ్విసోరీ కమిటీ అధ్యక్షులు జయంత్ చల్ల కాన్ఫరెన్స్ విజయవంతం చెయ్యటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. తానా, నాట, టీడీఫ్, నాట్స్, టాటా ,GWCTS, వారధి, తాం, ఉజ్వల మరియు ఎన్నో సంస్థలు కాన్ఫరెన్స్ కి తమ సంఘీభావం ప్రకటించాయి.

ఘనంగా ప్రారంభమైన ఆటా వాషింగ్టన్ డీసీ కాన్ఫరెన్స్ పనులు

అమెరికా నలుమూల నుంచి ఎంతో మంది ఆటా కార్యవర్గ, ఎగ్జిక్యూటివ్ మరియు వాలంటీర్స్ ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. 100 మంది ఆటా, కాట్స్ సభ్యులు కన్వెన్షన్ సెంటర్ టూర్లో పాల్గొని ఎటువంటి ఏర్పాట్లు చేయ్యాలో సమాలోచన చేశారు. చిన్నారుల నృత్యాలు అందరిని అలరించాయి. యువ గాయని గాయకుల పాటలు శ్రోతలను మైమరిపించాయి. ఫండ్ రైసింగ్ కార్యక్రమంలో 75వేల డాలర్ల విరాళాలు సేకరించారు. ఆటా పూర్వ అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, కరుణాకర్ అసిరెడ్డి.. లోకల్ టీం, మీడియా మిత్రుల సహకారాన్ని కొనియాడారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.