'ఆటా' ఝుమ్మంది నాదం ఆన్లైన్ పాటల పోటీలు
ABN , First Publish Date - 2020-05-29T15:53:34+05:30 IST
అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూన్ నెల నాలుగవ వారం నుండి జులై చివరి వరకు ఆన్లైన్ పాటల పోటీ “ఝుమ్మంది నాదం” నిర్వహిస్తోంది.
అమెరికా తెలుగు సంఘం (ఆటా) జూన్ నెల నాలుగవ వారం నుండి జులై చివరి వరకు ఆన్లైన్ పాటల పోటీ “ఝుమ్మంది నాదం” నిర్వహిస్తోంది. సోలో సింగింగ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో అమెరికాలో నివసించే వారు పాల్గొనవచ్చు. ఇందులో గెలిచిన తుది విజేతలకు ఆటా టైటిల్ లభిస్తుంది. ఆటా మహాసభల్లో పలువురు సెలెబ్రిటీల మధ్యవారిని సత్కరించడం జరుగుతుంది. ప్రిలిమనరీ రౌండ్స్, ఆన్లైన్ స్క్రీనింగ్, సెమిఫైనల్స్, ఫైనల్స్ పోటీలు ఆన్లైన్ (జూమ్) ద్వారానే జరుగుతాయి.
సబ్జూనియర్స్ విభాగంలో పాల్గొనేవారు 9 సంవత్సరాలలోపు వారై ఉండాలి. జూనియర్స్ విభాగంలో పాల్గొనాలనుకునేవారు 10-14 సంవత్సరాలలోపు ఉండాలి. సీనియర్స్ విభాగంలో 15 వయస్సు దాటినవాళ్ళు పాల్గొనవచ్చు. క్లాసికల్, నాన్ క్లాసికల్ విభాగంలో పోటీలు ఉంటాయి. ఈ పోటీలకు జడ్జీలుగా శ్రీని ప్రభల (మ్యూజిక్ డైరెక్టర్), రేవంత్ (సింగర్), వాసా గోపినాథ్రావు (కర్ణాటక సంగీత విద్వాంసులు) వ్యవహరించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలకునేవారు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ లింక్: https://tinyurl.com/ATA-JN2020
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూన్ 7, 2020
పూర్తి వివరాలకు రిజిస్ట్రేషన్ లింక్ గైడ్ లైన్స్ చూడండి (లేదా) JhummandiNaadam@ataworld.org కి ఇమెయిల్ చెయ్యండి.
అన్ని పోటీలు ఆటా ఫేస్బుక్లో, ఆటా యూట్యూబ్ మరియు ఇతర టీవీ చానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.