Abn logo
May 30 2020 @ 22:52PM

ఆర్జీవీ వరల్డ్‌లో...అలాంటి సినిమాలు ఉండవ్‌!

‘‘ఎప్పట్నుంచో ఓటీటీలోకి రావాలనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది! ఆర్జీవీవరల్డ్‌.ఇన్‌ (శ్రేయా్‌స ఈటి యాప్‌లో..) తీసుకొస్తున్నా. అందులో ఇంటిల్లిపాదీ చూసే సినిమాలు ఉండవ్‌. నా అభిరుచికి తగ్గ చిత్రాలు, నాకు నచ్చిన చిత్రాలు మాత్రమే ఉంటాయి’’ అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. శృంగార తార మియా మాల్కోవా ప్రధాన పాత్రలో ఆయన తీసిన చిత్రం ‘క్లైమాక్స్‌’. జూన్‌ 6న ఆర్జీవీవరల్డ్‌. ఇన్‌, శ్రేయా్‌స ఈటి యాప్‌లో విడుదల కానుంది. లాక్‌డౌన్‌లో చిత్రీకరించిన ‘కరోనా వైరస్‌’ సైతం ఓటీటీలో విడుదల కానుందని ఆర్జీవీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ...


‘‘నాటకాల నుంచి సినిమాలొచ్చాయి. బ్లాక్‌్క్షవైట్‌ నుంచి కలర్‌ సినిమాలొచ్చాయి. నాలుగేళ్ల నుంచి వెబ్‌ సిరీస్‌ ట్రెండ్‌ మొదలైంది. సినీ పరిశ్రమకు సమాంతరంగా ఓటీటీకి ఆదరణ లభిస్తోంది. ఓటీటీ కోసం వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాల్లో నూటికి 90 శాతం ఫ్లాపులే అంటారు. థియేటర్‌ అద్దెలు, పబ్లిసిటీ ఖర్చులు, వగైరా కూడా అందుకు కారణం. ఓటీటీలో విడుదలకు ఆ ఖర్చులేవీ ఉండవు. మేకింగ్‌ ఖర్చు ఒక్కటే. అమ్ముకుంటే ముందే ఆదాయం రావచ్చు. వీక్షకులకు నచ్చిన సమయంలో నచ్చిన సిరీస్‌ లేదా సినిమాను ఓటీటీలో చూడొచ్చు.


ఓసారి చూస్తే వంద రూపాయలు!

రెండు, రెండున్నర గంటల నిడివిలో సినిమా తీయాలనే నిబంధన ఏదీ లేకపోవడం ఓటీటీలో ఉన్న మరో సౌలభ్యం. ఉదాహరణకు... ‘క్లైమాక్స్‌’ 55 నిమిషాలే. మినీ మూవీ అన్నమాట! ఒకసారి చూడడానికి వంద రూపాయలు చెల్లించాలి. మళ్లీ చూడాలంటే మరో వంద రూపాయలు. ‘పే పర్‌ వ్యూ’ అన్నమాట. విహారయాత్ర కోసమని ఓ జంట ఏడారికి వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది కథ.


కమల్‌ హాసన్‌ ప్లాన్‌ చేసినప్పుడు...

‘డీటీహెచ్‌’ (డైరెక్ట్‌ టు హోమ్‌) పద్దతిలో ‘విశ్వరూపం’ చిత్రాన్ని కమల్‌ హాసన్‌ విడుదల చేయాలనుకున్నారు. అయితే, అప్పట్లో అందరి ఇళ్లలో సెటప్‌ బాక్సులు లేవు. అలా చేస్తే... జనం థియేటర్లకు వస్తారా? రారా? అనే సందేహంతో ఆయన చివరి నిమిషంలో తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ అవుతాయో తెలియని పరిస్థితి. అందువల్ల, వీక్షకుల నుంచి ఓటీటీకి ఆదరణ బావుంది.


‘కరోనా వైరస్‌’... హారర్‌ చిత్రమే!

ప్రస్తుతం ప్రపంచంలో పరిస్థితులు హారర్‌ చిత్రాన్ని తలపిస్తున్నాయి. ఎవరైనా దగ్గితే భయపడుతుంటే హారర్‌ కాక మరేమిటి? అందుకని, నా దృష్టిలో ‘కరోనా వైరస్‌’ హారర్‌ సినిమా. నేను తీసిన తొలి ఫ్యామిలీ సినిమా కూడా! లాక్‌డౌన్‌లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ తీశాం. కరోనా వచ్చినప్పుడు ఎవరూ సీరియ్‌సగా తీసుకోలేదు. చైనాలో వచ్చినప్పుడు ఇండియాలో మోడీ, ట్రంప్‌ లక్షలమందితో మీటింగ్‌ పెట్టారు. ప్రపంచాన్ని ఇంత భయపెడుతుందని ఎవరూ ఊహించలేదు.


మనవరాల్ని చూడలేదు!

కరోనా వైరస్‌ వస్తుందని ఊహించామా? లేదు కదా! అలాగే, తాతయ్య అవుతానని ఊహించలేదు. అంతే!’’ మనవరాల్ని తానింకా చూడలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా వర్మ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement