ఒలింపిక్స్‌ వద్దే.. వద్దు

ABN , First Publish Date - 2021-05-15T09:18:12+05:30 IST

ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని లక్షలాదిమంది జపాన్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఒలింపిక్స్‌ వద్దే.. వద్దు

3.50 లక్షల సంతకాల సేకరణ

 నిర్వాహక కమిటీకి అందజేత


టోక్యో: ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని లక్షలాదిమంది జపాన్‌ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. టోక్యోకు చెందిన న్యాయవాది కెంజీ సునోమియా ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో సేకరించిన 3.50 లక్షల సంతకాలతో కూడిన విన్నపాన్ని విశ్వక్రీడల నిర్వాహకులకు శుక్రవారం అందజేశారు. కొత్త వేరియంట్లతో జపాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ టోక్యో, ఒసాక తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అత్యయిక పరిస్థితి అమలవుతోంది. ఈనేపథ్యంలో ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ ఊపందుకోవడం గమనార్హం. ఈనెల 31వరకు అత్యయిక పరిస్థితి కొనసాగనుండగా.. దానిని దేశంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారని తెలుస్తోంది. ఇక కరోనాతో ఏడాది వాయిదాపడిన విశ్వక్రీడలు జూన్‌ 23న మొదలవనున్నాయి. కాగా, టోక్యో రద్దు పిటిషన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌, పారాలింపిక్స్‌ కమిటీ చీఫ్‌ ఆండ్రూకు కూడా పంపనున్నారు. 

Updated Date - 2021-05-15T09:18:12+05:30 IST