Abn logo
Sep 17 2020 @ 00:21AM

ఒకానొక సమయంలో... దెయ్యం!

కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు. అందులో ‘ఒకానొక సమయంలో అక్కడ ఓ దెయ్యం నివసించింది’ అని పేర్కొన్నారు. అనిరుధ్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. కమల్‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కార్తీ కథానాయకుడిగా నటించిన ‘ఖైదీ’తో తమిళ, తెలుగు భాషల్లో లోకేశ్‌ కనగరాజ్‌ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విజయ్‌ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘మాస్టర్‌’ విడుదల కావాల్సి ఉంది. కరోనా వల్ల సినిమా విడుదలకు అంతరాయం ఏర్పడింది. 

Advertisement
Advertisement
Advertisement