కనీసం ఆక్సీజన్ కావాలి: మోదీపై మండిపడ్డ పీకే

ABN , First Publish Date - 2021-04-23T01:30:05+05:30 IST

దేశంలో ఆక్సీజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. దీనికి సంబంధించిన వార్తను షేర్ చేస్తూ ‘‘నరేంద్రమోదీ సర్.. మేం ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం అని వేల మంది గోడు వెల్లబోసుకుంటున్నారు..

కనీసం ఆక్సీజన్ కావాలి: మోదీపై మండిపడ్డ పీకే

న్యూఢిల్లీ: కోవిడ్-19ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ ప్రజల్ని ధైర్యంగా ఉండమని ప్రధాని చేసిన సూచనపై వ్యంగ్యంగా స్పందిస్తూ ‘‘ధైర్యంగా ఉండాలంటే కనీసం ఆక్సీజన్ అయినా అందాలి కదా’’ అంటూ విమర్శించారు. గురువారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హిందీలో చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


దేశంలో ఆక్సీజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. దీనికి సంబంధించిన వార్తను షేర్ చేస్తూ ‘‘నరేంద్రమోదీ సర్.. మేం ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం అని వేల మంది గోడు వెల్లబోసుకుంటున్నారు. ధైర్యంగా ఉండాలంటే కనీసం ఆక్సీజన్ అయినా అందాలి కదా’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో వియ్ కాంట్ బ్రీత్ (మనం ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం) అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ట్వీట్‌లో మొదట నరేంద్రమోదీని ట్యాగ్ చేశారు.

Updated Date - 2021-04-23T01:30:05+05:30 IST