కనీసం కనికరించరా?

ABN , First Publish Date - 2020-05-23T09:02:21+05:30 IST

వివిధ రూపాల్లో 157 రోజుల నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.

కనీసం కనికరించరా?

మనుషులుగా కూడా పరిగణించరా

157వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతుల ఆవేదన 


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తుళ్లూరు, తాడికొండ, మే 23: వివిధ రూపాల్లో 157 రోజుల నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయినా కనీస కనికరం కలగటం లేదు. మమ్మల్ని మనుషులుగా కూడా పరిగణించడంలేదు..’ అంటూ రాజధాని రైతులు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 157వ రోజుకు చేరాయి.


లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా ఎవరి ఇళ్లలో వారు ఉంటూ అనంతవరం, తుళ్లూరు, మందడం, రాయపూడి, నెక్కల్లు, దొండపాడు, వెలగపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల్లో నిరసనలు జరిగాయి. తమది న్యాయపోరాటమని, న్యాయస్థానాలే తమకు దిక్కన్నారు. భావితరాలకు బంగారు బాట అమరావతి అంటూ అమరావతి వెలుగు కార్యక్రమం చేపట్టారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో చేస్తున్న రైతులు చేస్తున్న నిరసనలు శుక్రవారం 33వ రోజు కొనసాగాయి.  

Updated Date - 2020-05-23T09:02:21+05:30 IST