ఇండోనేషియా బంగారు గనిలో ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2021-02-25T13:20:24+05:30 IST

ఇండోనేషియా దేశంలోని బంగారం గనిలో ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 70 మంది...

ఇండోనేషియా బంగారు గనిలో ఘోర ప్రమాదం

కొండచరియలు విరిగిపడి ఐదుగురి దుర్మరణం, 70 మంది గల్లంతు

జకార్తా (ఇండోనేషియా): ఇండోనేషియా దేశంలోని బంగారం గనిలో ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 70 మంది గల్లంతయ్యారు. ఇండోనేషియా దేశంలోని సెంట్రల్ సులావేసిలోని బంగారపు గనిలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించగా, మరో 70మంది గల్లంతయ్యారు.పరిగి మౌంటాంగ్ జిల్లాలోని బురంగా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. కొండచరియలు విరిగిపడిన బంగారపు గనిలో నుంచి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో 70 మంది గల్లంతయ్యారని, వారు కొండచరియల కింద ఉంటారని వారి కోసం శోధిస్తున్నామని ఇండోనేషియా డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అధిపతి దాటూ పముసు చెప్పారు. కొండచరియలు విరిగిపడిన గనిలో మృతదేహాలను వెలికితీసేందుకు సహాయపునరావాస సిబ్బంది యత్నిస్తున్నారు. 

Updated Date - 2021-02-25T13:20:24+05:30 IST