Abn logo
Jun 12 2021 @ 20:29PM

అమెరికాలో కాల్పుల కలకలం.. 13 మందికి గాయాలు

హ్యూస్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడటంతో దాదాపు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఓ దుండగుడు తుపాకీతో దాడికి దిగాడు. దీంతో కాల్పుల్లో సుమారు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాల్పులకు తెగబడ్డ దుండగుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు. దుండగుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ దాడి వెనక ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌లో గురువారం రోజు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో వృద్ధ మహిళ సహా ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. 


తాజా వార్తలుమరిన్ని...