ఈ పసివాడి ప్రాణానికి ఇక మీరే ఆధారం....

ABN , First Publish Date - 2021-02-23T19:59:10+05:30 IST

అవయవాల వైఫల్యం వల్ల నా కొడుకు ప్రాణం ప్రమాదంలో పడింది. దయచేసి చేయూతనిచ్చి ఆ పసిప్రాణాన్ని కాపాడండి....

ఈ పసివాడి ప్రాణానికి ఇక మీరే ఆధారం....

"అవయవాల వైఫల్యం వల్ల నా కొడుకు ప్రాణం ప్రమాదంలో పడింది. దయచేసి చేయూతనిచ్చి ఆ పసిప్రాణాన్ని కాపాడండి...." ఓ తల్లి వేదన ఇది. ఆగని తన మనోవ్యధ ఇంకా కొనసాగుతూనే ఉంది....


నేను వయసులో ఉన్న రోజుల్లోనే నాకంటూ ఒక కుటుంబం ఉండాలని ఎన్నో కలలు కనే దాన్ని.... నరేష్‌తో నాకు పెళ్ళయినప్పుడు నా కలలు సాకారమయ్యే రోజుల కోసం ఆరాటపడుతూనే ఉన్నాను. నా కడుపు పండిందనే విషయం తెలిసిన రోజు.... నా జీవితంలోనే అదొక పండగ దినంగా ఆనందపడ్డాను. నా చిన్నారి రాక కోసం ఏమేం చెయ్యాలో... ఎన్నెన్ని చెయ్యాలో అన్నీ చేశాము.


మా దురదృష్టం.... పిల్లాడు పుట్టిన 8 నెలలకే సమస్యలు చుట్టుముట్టాయి. మా కుటుంబం కోసం కాసుకు కూర్చున్న క్రూరమైన విధిని ఆపే శక్తి ఈ భూమ్మీద మరేది లేదనిపించింది.


గతే జులై 2020లో మా అబ్బాయి తరచుగా వాంతి చేసుకోవడం గమనించాను. నేనెంత ప్రయత్నించినా మా అబ్బాయి కడుపు ఆహారంతో నిండేలా చెయ్యలేకపోయాను. కొద్ది రోజుల్లోనే బాబు తీవ్రమైన నీళ్ళ విరేచనాలతో బాధ పడటం మొదలైంది.


మేం వాడి ఆరోగ్యం గురించి ఎంతో ఆందోళన పడ్డాం. వెంటనే నేను, నరేష్ కలిసి బాబును డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాము. మా అబ్బాయి ఒంట్లో నీటి శాతం ఉండాల్సిన దానికంటే బాగా పడిపోయి డీహైడ్రేషన్‌కి గురయ్యాడని, వాడి వయసుకు ఉండాల్సిన బరువు కంటే ఎంతో తగ్గిపోయాడని చెప్పారు.


నాకు గుండె బద్దలైంది. రోజులు గడుస్తున్న కొద్దీ మా అబ్బాయి ఆరోగ్యం మరింతగా దిగజారిపోతూ వచ్చింది. ఆస్పత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు నా దగ్గరి నుంచి మా అబ్బాయిని తీసుకుని పరీక్షలు చేసి, పరిశీలించి, సమస్యను డయాగ్నోస్ చేశారు.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


నా కొడుకు ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను. కానీ, వాస్తవ పరిస్థితి నా ఆశలకు ఎంతో దూరంలో ఉంది. అబ్బాయికి వెంటనే బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యాలి. నేను, నరేష్ ఈ వార్తను ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోయాము.


నరేష్‌కి వచ్చే ఆదాయం నెలకు రూ.5,000 మాత్రమే. అది మా రోజువారీ అవసరాలు తీర్చడానికి మాత్రం సరిపోతుంది. మా బాబును కాపాడుకోవడం కోసం మేం పడుతున్న బాధ విన్న వారిని బతిమాలి అప్పు చేశాం. మాకున్న కొన్ని విలువైన వస్తువులు అమ్మి ఎలాగో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు డబ్బు చెల్లించగలిగాం. కానీ, దురదృష్టవశాత్తు, సర్జరీ జరిగిన తర్వాత మా బాబు ఊపిరితిత్తుల్లో ఒకదానికి తీవ్రంగా గాయం కావడంతో అది ఇన్ఫెక్షన్‌కి గురైంది.


ఈ బాధ చాలక... మా అబ్బాయి అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందడం లేదు. వాటి పనితీరు చాలా వేగంగా మందగిస్తోంది. మా పసిప్రాణానికి కొత్త జీవితం అందాలంటే అత్యవసరంగా మీ సహాయం కావాలి.



వెంటిలేటర్ పైనున్న మా బాబు చేతులకు గుచ్చి ఉన్న సూదులు, ట్యూబులే వాడిని బతికి ఉంచాయి. వాడి దేహం పాలిపోయింది. ఎంతో బరువు కోల్పోయాడు. మందుల ప్రభావం వల్ల ఎక్కువ సమయం మత్తులోనే ఉంటున్నాడు. కానీ, మెలకువ వచ్చినప్పుడు మాత్రం బాధతో ఏడుస్తున్నాడు.


నా కంటి పాపను ఆ స్థితిలో చూడలేకపోతున్నాను. వాడు నాకు దూరమవుతాడేమోనని భయంగా ఉంది. మా బాబుకు ట్రాన్స్‌ప్లాంట్ జరిగిన తరువాత, ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు సహకరించడానికి ఎవ్వరూ లేరు. ఉదార హృదయంతో మీరిచ్చే విరాళాలే వాడి ఊపిరికి ఉన్న ఏకైక ఆధారం. నా బాబును దూరం కానివ్వకండి. దయచేసి చేయూతనిచ్చి సహకరించండి.

Updated Date - 2021-02-23T19:59:10+05:30 IST