60 ఏళ్లకు పైబడిన వారికి ఆస్ట్రాజెనెకా టీకా ఇవ్వొద్దు..ఈఎమ్‌ఏ టాస్క్ ఫోర్స్ చీఫ్

ABN , First Publish Date - 2021-06-14T05:15:21+05:30 IST

వయోధికులకు ఆస్ట్రాజెనెకా టీకా ఇవ్వకపోవడమే మంచిదని ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ తాజాగా అభిప్రాయడ్డారు.

60 ఏళ్లకు పైబడిన వారికి ఆస్ట్రాజెనెకా టీకా ఇవ్వొద్దు..ఈఎమ్‌ఏ టాస్క్ ఫోర్స్ చీఫ్

జెనీవా: వయోధికులకు ఆస్ట్రాజెనెకా టీకా ఇవ్వకపోవడమే మంచిదని ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసిన కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ తాజాగా అభిప్రాయడ్డారు. కరోనా కోసం పలు టీకాలు ఇప్పటికే అందుబాటులోకి రావడం, ఆస్ట్రాజెనెకా టీకా వల్ల రక్తం గడ్డ కడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే..ఆస్ట్రాజెనెకా టీకాను అన్ని వయసుల వారికీ ఇవ్వచ్చని గతంలోనే ప్రకటించిన ఐరోపా ఔషధ నియంత్రణ సంస్థ..ఇప్పటికే ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది. కానీ ఐరోపా సమాఖ్యలోని పలు సభ్య దేశాలు మాత్రం కొన్ని వయసుల వారికీ ఈ టీకా ఇవ్వడాన్ని తాత్కాలికంగా విరమించాయి. 

Updated Date - 2021-06-14T05:15:21+05:30 IST