సీకెడీ బాధితులకు వరం.. ఆస్ట్రాజెనెకా ఔషధం

ABN , First Publish Date - 2020-09-02T13:15:33+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేకమందిని బాధిస్తున్న వ్యాధి దీర్ఘకాలి మూత్రపిండాల వ్యాధి(సీకెడీ). దీనికి మధుమేహం, హైపర్‌టెన్షన్‌(పెరుగుతున్న రక్తపోటు) కేసులు పెరుగుతుండటం..

సీకెడీ బాధితులకు వరం.. ఆస్ట్రాజెనెకా ఔషధం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేకమందిని బాధిస్తున్న వ్యాధి దీర్ఘకాలి మూత్రపిండాల వ్యాధి(సీకెడీ). దీనికి మధుమేహం, హైపర్‌టెన్షన్‌(పెరుగుతున్న రక్తపోటు) కేసులు పెరుగుతుండటం ముఖ్యకారణం. దేశంలో  సీకెడీ తీవ్రత 17.2%గా ఉందని అంచనా.  ఈ నేపథ్యంలో వృద్ధి చెందుతున్న సీకెడీ రోగులు, అటు ఆరోగ్య సంరక్షణ రంగంతో పాటుగా ఇటు రాబోయే సంవత్సరాలలో ఆర్ధికవ్యవస్థకు సైతం అతి ప్రధాన సమస్యగా నిలిచే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇండియా (ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్‌) తమ తాజా మధుమేహ ఔషదం, డపాగ్లిఫ్లాజిన్‌ క్లీనికల్‌ ట్రయల్స్‌ పూర్తి ఫలితాలను వెల్లడించింది. టైప్‌ 2 మధుమేహం లేదా మధుమేహంతో మాత్రమే బాధడుతున్న రోగులలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు(సీకెడీ) తీవ్రతను తగ్గించడంలో ఈ ఔషదం చక్కటి ప్రయోజనాలను చూపింది. అత్యున్నత యాంటీ –డయాబెటిక్‌గా పనిచేయడమే కాక హార్ట్‌ ఫెయిల్యూర్‌ నష్టాలను  ఈ సీకెడీ తగ్గిస్తుంది.


దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులంటే..

 మూత్రపిండాలు చెడిపోవడంతో పాటుగా రక్తాన్ని సక్రమంగా వడపోయాల్సిన తన బాధ్యతను అవి సక్రమంగా నిర్వర్తించవు. దీర్ఘకాలంలో  మూత్రపిండాలకు నష్టం నెమ్మదిగా జరుగుతుండడంతో ఈ వ్యాధిని క్రానిక్‌గా పిలవడం జరుగుతుంది. దీని వల్ల సంభవించే ఇతర ఆరోగ్య సమస్యలలో గుండె వ్యాధులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే, స్ట్రోక్‌, లేదంటే గుండె ఫెయిల్యూర్‌ అయ్యేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ వ్యాధికి అధిక రక్త పోటు కూడా ఓ కారణం. దాని ఫలితంగానే కిడ్నీ సమస్యలు అధికంగా తలెత్తుతాయి.

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల తొలి దశలో, వ్యక్తులకు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. పాదాలు, మోకాళ్లు వాయడం, కండరాలు పట్టేయడం, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలను గమనించవచ్చు. అయితే కిడ్నీల పనితీరు గణనీయంగా బలహీన పడే వరకూ ఈ వ్యాధి స్పష్టంగా కనిపించకపోవచ్చు. సెరమ్‌ క్రియాటిన్‌, బ్లడ్‌ యూరియా, యూరిన్‌ అల్బుమిన్‌ లాంటి పరీక్షలు చేయడం ద్వారా ఆ వ్యక్తులు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారో కనిపెట్టవచ్చు. ఒకసారి నిర్ధారణ జరిగిన తరువాత చికిత్సలో  మూత్రపిండాలకు జరిగే నష్టాన్ని నెమ్మది చేయడంపై దృష్టి సారిస్తారు. సాధారణంగా దీనికి ప్రధాన కారణాన్ని నియంత్రించడం ద్వారా అది సాధ్యం అవుతుంది. ఈ వ్యాధి తుది దశ కిడ్నీ ఫెయిల్యూర్‌గా అభివృద్ధి చెందుతుంది. డయాలిసిస్‌ లేదా మూత్రపిండాల మార్పిడి కూడా ఈ స్థితిలో సాధ్యపడక ప్రాణాంతికం కావొచ్చు. 

విప్లవాత్మక మూడోదశ దాపా–సీకెడీ ట్రయల్‌ సవివరమైన ఫలితాలు చూపేదాని ప్రకారం డపాగ్లిఫ్లోజిన్‌తో పాటుగా ప్రామాణికమైన సంరక్షణతో మూత్రపిండాల పనితీరు చెడిపోకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా సీకెడీతో బాధపడుతున్న రోగులలో ప్లాసెబోతో పోల్చినప్పుడు కార్డియోవాస్క్యులర్‌ (సీవీ) లేదా మూత్రపిండాల వల్ల మరణాలను 39% వరకూ తగ్గించవచ్చు. ఈ ఫలితాలు టైప్‌2 మధుమేహం (టీ2డీ)తో బాధపడుతున్న లేదా అది లేకుండా ఉన్న రోగులలో  స్థిరంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మధుమేహంతో బాధపడుతున్న మరియు మధుమేహం లేని పెద్దవారిలో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి చికిత్సలో గణనీయమైన ప్రయోజనాలను చూపుతున్న ఒకే ఒక్క ఇన్హిబిటర్‌ ఎస్‌జీఎల్‌టీ2.

Updated Date - 2020-09-02T13:15:33+05:30 IST