వారిపై టీకా పనిచేయదంటూ వార్తల హల్‌చల్.. స్పందించిన ఆస్ట్రాజెనెకా..!

ABN , First Publish Date - 2021-01-27T01:02:53+05:30 IST

అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధులపై ఆక్సఫ్‌ర్డ్ టీకా పనిచేయదంటూ వస్తున్న వార్తలపై టీకా తయారీదారు ఆస్ట్రాజెనెకా ఖండించింది.

వారిపై టీకా పనిచేయదంటూ వార్తల హల్‌చల్.. స్పందించిన ఆస్ట్రాజెనెకా..!

న్యూఢిల్లీ: అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధులపై ఆక్సఫ్‌ర్డ్ టీకా పనిచేయదంటూ వస్తున్న వార్తలపై టీకా తయారీదారు ఆస్ట్రాజెనెకా ఖండించింది. ఇవి వాస్తవదూరమని తేల్చి చెప్పింది. వయోధికులపై ఈ టీకా పనిచేయకపోవచ్చంటూ జర్మనీ మీడియాలో వస్తున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా స్పందించాల్సి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన వారి విషయంలో టీకా సామర్థ్యం 8 నుంచి 10 శాతం మధ్యే అంటూ జర్మనీ వార్తాపత్రికలు ప్రచురించాయి. దీన్ని ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకా నిర్ద్వంద్వంగా ఖండిస్తూ ఓ లేఖ రాసింది. టీకా ఇచ్చిన తరువాత వృద్ధులపై జరిపిన రక్త పరీక్షల్లో వారి రోగ నిరోధశక్తి పూర్తి స్థాయిలో ప్రేరేపితమైనట్టె వెల్లడైందని తెలిపింది. 

Updated Date - 2021-01-27T01:02:53+05:30 IST