Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆవాలతో అస్తమాకు చెక్

ఆంధ్రజ్యోతి(02-04-2020)

పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే ఆవాలు ఆరోగ్యానికి కొండంత అండగా ఉంటాయి. ఆవాల్లో ఫొటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్థాలు ఉంటాయి. అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల కేన్సర్లను నివారిస్తాయంటున్నారు నిపుణులు. అంతే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి. ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తగ్గకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లో ఆస్తమా అదుపులో ఉండడంతో పాటు జలుబు, ఛాతి పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయన్న విషయం ఇటీవలి పలు అధ్యయాలలో తేలింది. బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాల్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జీవక్రియలు బాగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్, ల్యూటిన్ వంటి పోషకాలు.. వయసు పెరగడంవల్ల శరీరంపై వచ్చే ముడతల్ని తగ్గిస్తాయి. మెత్తానికి ఆవాలను ఆహారంలో చేర్చుకోవడం వలన పలు ఆరోగ్య లాభాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...