నేటి నుంచి రైతు భరోసా

ABN , First Publish Date - 2020-05-15T09:28:04+05:30 IST

ఖరీ్‌ఫలో పంటల సాగుకు పెట్టుబడి కోసం వైఎ్‌సఆర్‌ రైతు భరోసా పథకాన్ని నేడు సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌

నేటి నుంచి రైతు భరోసా

కడప, మే 14 (ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫలో పంటల సాగుకు పెట్టుబడి కోసం వైఎ్‌సఆర్‌ రైతు భరోసా పథకాన్ని నేడు సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ ద్వారా రూ.2వేలు గత ఏప్రిల్‌లోనే రైతుల ఖాతాలో జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వైఎ్‌సఆర్‌ రైతు భరోసా పేరిట రూ.5500లు ఖాతాల్లో ప్రస్తుతం జమ చేయనుంది. జిల్లాలో 4,29,494 రైతుల ఖాతాలు ఉన్నాయి.


3,69,360 ఖాతాలు అప్‌లోడ్‌ చేశారు. వివిధ కారణాలను చూపుతూ 60,003 ఖాతాలను రిజక్ట్‌ చేశారు. పథకాన్ని ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అమలు చేయనున్నారు. కుటుంబంలో ఎంత మంది పేరుతో భూములన్నా కేవలం రేషన్‌ కార్డు ఆధారంగా ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అందించనున్నారు. నేటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానుంది.

Updated Date - 2020-05-15T09:28:04+05:30 IST