ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు భరోసా

ABN , First Publish Date - 2020-05-23T10:44:59+05:30 IST

ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు ప్రభుత్వం కష్టకాలంలో భరోసా కల్పించనుంది

ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు భరోసా

వచ్చే నెల 4న రెండో విడత వాహనమిత్ర

బ్యాంక్‌ ఖాతాల్లో పదివేలు జమ

కొత్తవారు ఈనెల 28లోపు దరఖాస్తులు చేసుకోవాలి


ఒంగోలు(క్రైం), మే 22 : ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు ప్రభుత్వం కష్టకాలంలో భరోసా కల్పించనుంది. రెండో విడత వైఎ్‌సఆర్‌ వాహనమిత్ర వచ్చే నెలలో పంపిణీ చేయనుంది. జిల్లాలో గతేడాది అక్టోబర్‌లో ప్రతి ఆటో, ట్యాక్సీడ్రైవర్‌కు బ్యాంక్‌ ఖాతాలో రూ.10వేలు జమచేసింది.  ఈ ఏడాది జూన్‌ నాలుగున ఈ పథకం అమలుకు సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాలో 12,406 మంది లబ్ధిదారులు ఉండగా కొత్తగా మళ్లీ అవకాశం ఇచ్చారు. ఎవరైనా ఆటోలు, ట్యాక్సీలు కొనుగోలు చేసి నడుపుకురు వారు ఈ నెల 28లోపు రవాణాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. మలివిడతంగా  వాహన మిత్రలకు పదివేలు నగదు బ్యాంక్‌లలో జమ కానుంది.


ఈ పథకానికి అర్హులు

  • గతంలో లబ్ధిదారుడిగా నమోదు చేసుకున్న వారు తిరిగి దరఖాస్తు చేయనవసరం లేదు.
  • కొత్తగా ఆటో, ట్యాక్సీ కొనుగోలు చేసి నడుపుకుంటున్న వారు మాత్రమే అర్హులు.
  • వాహనానికి అన్ని రకాల రికార్డులు ఉండాలి
  • వాహనం నడిపే యజమాని ఆధార్‌, తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉండాలి
  • ట్రాక్టర్‌ డ్రైవర్లు ఈ పథకానికి అర్హత లేదు.
  • గత ఏడాది వాహన మిత్ర కింద లబ్ధిపొందిన వారి జాబితాను సంబంధిత సచివాలయంలో అందుబాటులో ఉంచుతారు.
  • కొత్తవారు ఈ నెల 28 లోపు దరఖాస్తు చేయాలి
  • కొత్తగా ఆటోలు, ట్యాక్సీలు కొనుగోలు చేసిన వారు ఈ నెల 28 లోపు రవాణా శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుదారునకు ఒక్క వాహనం మాత్రమే ఉండాలి.
  • వాహనానికి సంబంధించిన రికార్డులకు ఆధార్‌కార్డు, డైవింగ్‌ లైసెన్స్‌ అనుసంధానం అయి ఉండాలి.
  • కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ ప్రారభించుకోవాలి
  • కొత్త వారే దరఖాస్తు చేసుకోవాలి
  • రవాణాశాఖ అధికారి ఏ.చంద్రంశేఖరరెడ్డి
  • వైఎ్‌సఆర్‌ వాహన మిత్ర సాయం వచ్చే నెల 4వ తేదీన మలివిడతగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు పదివేలు బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తాం. నూతనంగా ఆటోలు, ట్యాక్సీలు కొనుగోలు చేసినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2020-05-23T10:44:59+05:30 IST