3,12,799 మంది రైతులకు భరోసా

ABN , First Publish Date - 2021-05-14T04:49:44+05:30 IST

జిల్లాలో 3,12,799 మంది రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా వర్తించింది. సుమారు రూ.234.60 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి మూడో విడత రైతు భరోసా నిధులను గురువారం విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ.5,500, పీఎం కిసాన్‌ పథకం కింద రూ.2000 కలిపి మొత్తం రూ.7,500 చొప్పున రైతుల ఖాతాలకు జమైంది.

3,12,799 మంది రైతులకు భరోసా
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కలెక్టర్‌, ఎంపీ తదితరులు

రూ.234.60 కోట్లు విడుదల

కలెక్టరేట్‌, మే 13 : జిల్లాలో 3,12,799 మంది రైతులకు వైఎస్‌ఆర్‌ రైతు భరోసా వర్తించింది. సుమారు రూ.234.60 కోట్ల నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయం నుంచి మూడో విడత రైతు భరోసా నిధులను గురువారం విడుదల చేశారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద రూ.5,500, పీఎం కిసాన్‌ పథకం కింద రూ.2000 కలిపి మొత్తం రూ.7,500 చొప్పున రైతుల ఖాతాలకు జమైంది. లబ్ధిదారుల్లో భూ యజమానులు 2,81,945మంది, అటవీ భూమి సాగుదారులు 15,520 మంది, అర్జీదారులు 15,334 మందికి నిధులు విడుదలయ్యాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎంఎల్‌సీ సురేష్‌బాబు, ఎంఎల్‌ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, జేసీ కిషోర్‌కుమార్‌, వ్యవసాయ శాఖ.. పశుసంవర్ధక జేడీలు ఆశాదేవి, వైవీ రమణ, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

రైతుల సంక్షేమమే లక్ష్యం

రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రైతులకు పెట్టుబడి ఇబ్బంది లేకుండా రైతు భరోసా పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. 



Updated Date - 2021-05-14T04:49:44+05:30 IST