బాల్యానికి భరోసా..

ABN , First Publish Date - 2022-06-24T04:38:30+05:30 IST

పలకా, బల పం, పెన్ను పేపర్‌ పట్టాల్సిన బాల్యం వెట్టిచాకిరీ చేస్తూ.. ఆడుతూ పాడాల్సిన బాల్యం బందీలు గా మారి చదువుకు దూరమవుతున్నారు.

బాల్యానికి భరోసా..
ఆపరేషన్‌ ముస్కాన్‌-8 కార్యక్రమ నిర్వహణపై మాట్లాడుతున్న ఎస్పీ వెంకటేశ్వర్లు(ఫైల్‌)

- ఆపరేషన్‌ ముస్కాన్‌ దాడుల్లో బాలకార్మికులకు విముక్తి

- మైనర్లను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తాం

- ఎస్పీ వెంకటేశ్వర్లు


నారాయణపేట క్రైం, జూన్‌ 23: పలకా, బల పం, పెన్ను పేపర్‌ పట్టాల్సిన బాల్యం వెట్టిచాకిరీ చేస్తూ.. ఆడుతూ పాడాల్సిన బాల్యం బందీలు గా మారి చదువుకు దూరమవుతున్నారు. జిల్లాలో పోలీస్‌శాఖతో పాటు, డీసీపీవో, చైల్డ్‌లైన్‌, కార్మిక, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సమష్టిగా కృషిచేస్తూ జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 14 ఏళ్లలోపు పిల్లలతో ప్రమాదకర పనులు చేయిం చినా, 18 ఏళ్లలోపు పిల్లలతో కూలీ పనులు, వెట్టిచాకిరీ చేయించినా ఫ్యాక్టరీల చట్టం-1948, వెట్టిచాకిరీ చట్టం-1976, బాలకార్మిక నిషేధ చ ట్టం 1986, లేబర్‌ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి బాలకార్మికు లకు పేట జిల్లాలో అధికారులు విముక్తి కల్పిస్తూ వారి జీవితాలకు వె లుగు భరోసాను కల్పిస్తున్నారు. గతంలో జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్‌శాఖ తీసుకున్న చర్యలకు గాను డీజీపీ మహేం దర్‌రెడ్డి జిల్లా పోలీస్‌ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఇప్పటివరకు 477 మంది బాలకార్మికులకు విముక్తి

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలతో అకస్మిక దాడులు చేసి 477 బాలకార్మికులకు అధికారులు విముక్తి కల్పించడంతో పాటు, బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేసి బాలకార్మికులను ఆయా సమీపంలోని పాఠశాలల్లో చేర్పించారు. 2019 సంవత్సరంలో 159 మంది, 2020లో 75మంది బాలకార్మికులకు విముక్తి కల్పించగా 2021 సంవత్సరంలో 186, 2022 సంవత్సరంలో నిర్వహించిన ఆప రేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో 57మందిని వెట్టిచాకిరి పనుల నుంచి విముక్తి కల్పించగా జూలై ఒకటి నుంచి ఈనెల చివరివరకు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌-8 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

 పిల్లలను పనికి పంపకుండా చదివించాలి

వెనకబడిన నారాయణపేట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే భావితరాలకు ది క్సూచి అయిన ఈప్రాంత బాలబాలికలు చదువుకోవాలి. బాలకార్మికులతో పనులు చే యిస్తే వారి హక్కులను ఉల్లంఘించినట్లే. ఆపరే షన్‌ ముస్కాన్‌-8 కార్యక్రమం జూలై ఒకటి నుంచి చివరివరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించి బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు మావంతు కృషి చేస్తాం. ఎక్కడైనా బాలకార్మికులు ఉన్నట్లయితే వెంటనే డయల్‌ 100 లేదా 1098 నెంబర్‌కు సమాచారం అందించాలి. 





Updated Date - 2022-06-24T04:38:30+05:30 IST