సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-05-21T06:28:09+05:30 IST

సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌గా బైరెడ్డి సత్యనారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది పుష్ప

సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ
మంత్రి జగదీ్‌షరెడ్డిని కలిసి మొక్కను అందజేస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి

సూర్యాపేటటౌన్‌, మే 20 : సూర్యాపేట మునిసిపల్‌ కమిషనర్‌గా బైరెడ్డి సత్యనారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డిని కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఈఈ జీకేడీ ప్రసాద్‌, డీఈ సత్యరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, జనార్థన్‌రెడ్డి, గౌసోద్దీన్‌, ప్రసాద్‌, మనోజ్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-21T06:28:09+05:30 IST