సమాజ హితం కోసం సంఘాలు

ABN , First Publish Date - 2022-01-24T06:14:35+05:30 IST

ప్రజలను సంఘటితం చేసి వారిని మంచి మార్గాల్లో నడిపించడానికి సంఘాలు దోహదపడుతాయని, సంఘాలు సమాజ హితం కోసం పాటుపడుతాయని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు.

సమాజ హితం కోసం సంఘాలు
మాట్లాడుతున్న జిందం చక్రపాణి

సిరిసిల్ల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలను సంఘటితం చేసి వారిని మంచి మార్గాల్లో నడిపించడానికి సంఘాలు దోహదపడుతాయని, సంఘాలు సమాజ హితం కోసం పాటుపడుతాయని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. అదివారం సిరిసిల్లలో తెలంగాణ వీరభధ్రీయ (వీరముష్టి) సంఘం సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గం, మండల కమిటీల కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా అధ్యక్షుడిగా పొన్నాల శివకుమార్‌, వర్కింగ్‌ అధ్యక్షుడిగా అగుల్ల రాజలింగం, ఉపాధ్యక్షుడిగా బానాల గోపి, కార్యదర్శి అగుల్ల విక్రమ్‌, సహాయ కార్యదర్శి అగుల్ల రవి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు మల్యాల దేవయ్య, రాచర్ల గోల్లపల్లి అధ్యక్షుడు శ్రీనివాస్‌, ముస్తాబాద్‌ అధ్యక్షుడు రాజేశం, వేములవాడ అధ్యక్షుడు మల్యాల అంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరించుకుంటూ మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సామాజిక వర్గాల మత విశ్వాసాలను గౌరవిస్తూ వారి ఎదుగుదలకు, పండుగలకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. మంత్రి కేటీఆర్‌ సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. వీరభద్రీయ సంఘం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కార్యవర్గాలను ఏర్పాటు చేసుకోని సంఘం అభివృద్ధికి పాటుపడడాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, తెలంగాణ వీరభద్రీయుల చారిటబుల్‌ ట్రస్ట్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాటెపల్లి రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:14:35+05:30 IST