క్షతగాత్రులకు కూడా సాయం అందించాలి: బోండా ఉమా

ABN , First Publish Date - 2020-08-09T19:25:59+05:30 IST

స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని..

క్షతగాత్రులకు కూడా సాయం అందించాలి: బోండా ఉమా

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం చాలా దురదృష్టకరమని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రమాదంపై సమీక్ష జరిపిన అనంతరం ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఇది ఘోరమైన దర్ఘటనగా తెలుగుదేశం పార్టీ భావిస్తోందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు తనకు ఫోన్ చేశారని, అన్ని వివరాలు తెలియజేశానన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50లక్షలు పరిహారం ప్రకటించిందని, అలాగే గాయపడినవారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. కరోనా నుంచి కోలుకుందామని ఇక్కడకు వస్తే.. అగ్ని ప్రమాదం జరగి ప్రాణాలు పోవడం బాధాకరమైన విషయమన్నారు.


స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 11కు చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తోంది.

Updated Date - 2020-08-09T19:25:59+05:30 IST