రోడ్డుప్రమాదాల నివారణకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-05-27T04:57:58+05:30 IST

రోడ్డుప్ర మాదాల నివారణకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ రవిమనోహరాచారి పేర్కొన్నారు.

రోడ్డుప్రమాదాల నివారణకు సహకరించాలి
బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తిస్తున్న అధికారులు

మదనపల్లె క్రైం, మే 26: రోడ్డుప్ర మాదాల నివారణకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ రవిమనోహరాచారి పేర్కొన్నారు. గురువారం డీటీవో శాంతికుమారి, ఎంవీ ఐ సునీత, నేషనల్‌ హైవేస్‌ డీఈ శివరామ్‌, టూటౌన్‌ సీఐ మురళీ కృష్ణతో కలిసి పుంగనూరురోడ్డులో ఇటీవల జరిగిన రోడ్డుప్రమాద  స్పా ట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పుంగనూరు రోడ్డులో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని మూడు బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించామన్నారు. ఇందులో బోయకొండక్రాస్‌, మొలకలదిన్నెక్రాస్‌, 150వ మైలు ఉన్నా యన్నారు. ముఖ్యంగా వాహనాల స్పీడ్‌ కంట్రోల్‌ కోసం రేడియం స్టిక్కర్స్‌, లైట్‌ స్టడ్స్‌, రేడియం రీలింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రమాదాలకు సం బంధించి బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అయితే యాక్సిడెంట్‌ జోన్లు, బ్లాక్‌స్పాట్స్‌ ఏరియాల్లో వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసి విలువైన ప్రాణాలు కోల్పోవద్దంటూ ఆయన పిలుపుని చ్చారు. కార్యక్ర మంలో తాలూకా ఎస్‌ఐ చంద్రశేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-05-27T04:57:58+05:30 IST