ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-05-21T04:42:55+05:30 IST

ఖాళీగా ఉన్న సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీ స భ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజ కీయ పక్షాలు సహకారం అం దించాలని స్థానిక సంస్థల అద నపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ కోరారు.

ఎన్నికల నిర్వహణకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న తేజస్‌ నందలాల్‌పవర్‌

- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌


మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), మే 20: ఖాళీగా ఉన్న సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎంపీటీసీ స భ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజ కీయ పక్షాలు సహకారం అం దించాలని స్థానిక సంస్థల అద నపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ సభ్యు ల ఖాళీ స్థానాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 349 వార్డు సభ్యులు, తొమ్మిది సర్పంచులు, అలాగే 15 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు గాను 356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 21న కలెక్టర్‌ ఆమోదం పొందిన తర్వాత పోలింగ్‌ కేం ద్రాల తుది జాబితాను ఈనెల 24న ప్రకటించనున్న ట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలో ఇదివరకే పోలిం గ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించామని, వీటిపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జా బితాను తయారుచేసినట్లు ఆయన వెల్లడించారు. స మావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబి తా రాజకీయ పార్టీలకు ముందే అందజేయాలని, పోలింగ్‌ కేంద్రాలలో దివ్యాంగుల కోసం ప్రత్యేకించి ర్యాంపులు ఏర్పాటు చేయాలని, ఇటీవల చనిపోయిన కారణంగా ఖాళీ అయిన సర్పంచు, వార్డు సభ్యులు, ఎంపీటీసీల స్థానాలకు కూడా ఎన్నికలను నిర్వహిం చాలని కోరారు. అదనపు కలెక్టర్‌ స్పందిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ధారిత తేదీవరకు ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌ తరపున కోడుగల్‌ యాదయ్య, బీజేపీ నుం చి వీరబ్రహ్మచారి, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తర పున సాయిబాబా, సీపీఐ నుంచి రాంమోహన్‌, ఎంఐ ఎం నుంచి సదాతుల్ల, సీపీఎం నుంచి కురుమూర్తి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - 2022-05-21T04:42:55+05:30 IST