జ్వర సర్వేకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-01-24T06:45:43+05:30 IST

జ్వర సర్వేకు సహకరించాలని, రెండు రో జుల్లో సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి శ్రీధర్‌ ఆదేశించారు.

జ్వర సర్వేకు సహకరించాలి
జ్వర సర్వేను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

డీఎంఅండ్‌ హెచ్‌వో శ్రీధర్‌

కొడిమ్యాల, జనవరి 23 : జ్వర సర్వేకు సహకరించాలని, రెండు రో జుల్లో సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి శ్రీధర్‌ ఆదేశించారు. ఆదివారం మండలంలోని పూడూర్‌, చెప్యాల గ్రామాలలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. సి బ్బందికి అవసరమైన పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ జ్వర లక్షణాలు ఉన్న వారికి వెంటనే కిట్లను పంపిణీ చేయాలన్నారు. మండల వైద్యాధికారి శ్రీనివాస్‌, సీహెచ్‌వో రాజశేఖర్‌ ఉన్నారు.

జగిత్యాల రూరల్‌ : ప్రభుత్వం చేపడుతున్న జ్వర సర్వేకు ప్రజలంద రు సహకరించాలని జిల్లా ఉప వైధ్యాధికారి డాక్టర్‌ జైపాల్‌రెడ్డి కోరారు. ఆదివారం ఇంటింటా జ్వర సర్వేలో భాగంగా జగిత్యాల మండలం తిప్ప న్నపేట గ్రామంలో ఇంటింటికి తిరుగతూ వివరాలను సేకరించారు.  క రోనా ధర్డ్‌వేవ్‌ తీవ్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టిందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి మహేష్‌, కారో బార్‌ రమేష్‌, ఆశాకార్యకర్త రజిత, వార్డు మెంబర్‌ లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T06:45:43+05:30 IST