జ్వర సర్వేకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-01-25T05:00:53+05:30 IST

జ్వర సర్వేకు సహకరించాలి

జ్వర సర్వేకు సహకరించాలి
తాండూరులో ఫీవర్‌ సర్వేను పరిశీలిస్తున్న వైస్‌చైర్‌పర్సన్‌ దీప

తాండూరు/కులకచర్ల/దోమ/కీసర రూరల్‌/నవాబుపేట, జనవరి 24: జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని తాండూరు మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ దీప కోరారు. సోమవారం తాండూరు పట్టణం తొమ్మిదో వార్డు సాయిపూర్‌లో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ కరోనా కట్టడికే ఇంటింటి జ్వరసర్వే నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధి లక్షణాలున్న వారికి హోం ఐసొలేషన్‌ మెడికల్‌ కిట్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకోని వారు తప్పక తీసుకోవాలని సూ చించారు. జలుబు, దగ్గు, జ్వరం, వొంటి నొప్పులు ఉన్న వారు వారి సమస్యను వైద్య సిబ్బందికి తెలి పితే వారు మందులు ఇస్తారని, అవసరమైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తారని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్‌ నవీన, వైద్య సిబ్బంది సుధారాణి, ఆర్పీ సైరాభాను ఉన్నారు. కులకచర్ల మండలంలో ఫీవర్‌ సర్వేను జిల్లా మానిటరింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌ పరిశీలించారు. జ్వరం, దగ్గు, జలు బు, వొంటి నొప్పులు తదితర లక్షణాలుంటే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని తెలిపారు. మండలంలో 1,763 ఇళ్లను సర్వే చేయగా 42 ందికి జ్వరాలు ఉన్నట్లు తేలిందని, వారికి మెడికల్‌ కిట్లు అందజేశామని తెలిపారు. దోమలో ఫీవర్‌ సర్వేను ఎంపీటీసీ అనితయాదయ్యగౌడ్‌ పరిశీలించారు. జ్వరం, జలుబు లాంటి చిన్న సమస్యలున్నప్పుడు చూపించుకుంటే జ్వరం తీవ్రం కాకుండా ఉంటుందన్నారు. నిర్లక్ష్యాన్ని వీడి వైద్యుల సూ చనలు పాటించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఎన్‌ఎం నిర్మల పా ల్గొన్నారు. కీసర మండలం నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో సర్వే కొనసాగుతోంది. మున్సిపల్‌ చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, ప్రణిత ఫీవర్‌ సర్వేలో పాల్గొన్నారు. నాగారంలో 20 బృందాలు 4,029 ఇళ్లలో సర్వే  చేశారు. దమ్మాయిగూడలో 18 బృందాలు 1,768 ఇళ్లలో సర్వే చేశారు. కరోనా లక్షణాలున్న వారికి మెడికల్‌ కిట్లు అందజేశారు. నవాబుపేట మండలంలో వైద్య బృందం 1,022 ఇళ్లను సర్వే చేసింది. 47 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించి వారికి మెడికల్‌ కిట్లు పంపిణీ చేసినట్లు వైద్య బృందం తెలిపింది.

Updated Date - 2022-01-25T05:00:53+05:30 IST