Abn logo
Sep 25 2021 @ 00:25AM

జీడి పప్పు ఎగుమతులకు సహకరించండి

కామర్స్‌ సెక్రటరీతో చర్చిస్తున్న సంఘ ప్రతినిధులు

పలాస : జీడిపప్పు ఎగుమతులపై ఉన్న అవరోధా లు తొలగించి వ్యాపారులకు న్యాయం చేయాలని రాష్ట్ర కామర్స్‌ సెక్రటరీ బీవీ సుబ్రహ్మణ్యంను పలాస పారిశ్రామికవాడ జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో రాష్ట్ర జీడి వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మంలో పలాస వ్యాపార సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామేశ్వరరావు మాట్లాడుతూ... జీడి పప్పు రవాణాలో ఉన్న ఇబ్బందులు అధికా రులు, రాష్ట్ర నేతల దృష్టికి తీసుకు వెళ్లినట్టు చెప్పారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి తూముల శ్రీనివాసరావు, కోశాధికారి శాసనపురి శ్రీనివాసరావు, సీనియర్‌ వ్యాపారవేత్త మల్లా కాంతారావు, తాళాసు శ్రీను తదితరులు పాల్గొన్నారు.