అసైన్డ భూములు... ఆదాయ మార్గాలు

ABN , First Publish Date - 2021-12-09T05:23:42+05:30 IST

కియా పరిశ్రమ అసైన్డ భూముల్లో విచ్చలవిడిగా వ్యాపార సముదాయాలు వెలుస్తున్నాయి.

అసైన్డ భూములు...  ఆదాయ మార్గాలు
దుద్దేబండ సమీపంలోని అసైన్డ భూముల్లో వెలసిన హోటళ్లు

- వ్యవసాయ భూముల్లో అద్దె భవనాలు 

- నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారాలు 

- అధికారుల మౌనం!

పెనుకొండ రూరల్‌, డిసెంబరు 8: కియా  పరిశ్రమ అసైన్డ భూముల్లో విచ్చలవిడిగా వ్యాపార సముదాయాలు వెలుస్తున్నాయి. వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు  కాయలుగా వెలుగొందుతున్నాయి. పెనుకొండ మండలంలోని కియా కార్లపరిశ్రమ రాకతో ఎర్రమంచి, గుట్టూరు, అమ్మవారిపల్లి, మునిమడుగు, దుద్దేబండ, పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధితోపాటు వ్యాపార సముదాయాలు ఊపందుకున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్వార్థపరులు అసైన్డ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలు, హోటళ్లు, చిన్న చిన్న పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అఽధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అసైన్డ భూముల్లో నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలు, వ్యాపార సముదాయాలు నిర్వహించే వారిపై రెవెన్యూ అధికారులు తనిఖీలు చేసి కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. కియా  సమీపంలోని 44వ జాతీయ రహదారి సమీపంలో గత కొన్నేళ్ల నుండి అసైన్డ భూముల్లో వ్యాపార సముదాయాలు చిన్న పరిశ్రమలు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు వాటివైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం అందజేసిన వ్యవసాయ భూముల్లో రైతులు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే వాటికి విరుద్దంగా అసైన్డ భూముల్లో ఇష్టానుసారంగా వ్యాపారాలు నిర్వహిస్తూ కొందరు స్వార్థపరులు లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. 1950 సంవత్సరంలోపు రైతులకు అందజేసిన అసైన్డ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవచ్చని అప్పటి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అయితే ఆ భూములకు ఎనఓసీలు తెచ్చుకుని రిజిస్ర్టేషన చేసుకుని వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధనలు ఉన్నాయి. అలా కాకుండా నిబంధనలకు విరుద్దంగా అసైన్డ భూము ల్లో ఏమాత్రం వ్యవసాయేతర భూములు మార్చేందుకు కాని భూముల్లో పరిశ్రమలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు నిర్మించుకుని విచ్చలవిడిగా వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నారు. కియ కార్ల పరిశ్రమకు సంబంధి భూముల్లో చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్నా గ్రామ పంచాయతీతో అనుమతి పొందడంతోపాటు అహుడా గుర్తింపు తప్పనిసరి. ఆ తరువాతే వ్యాపార సముదాయాలు, హోటళ్లు నిర్వహించు కోవచ్చు. అలాకాకుండా కొందరు స్వార్థపరులు నిబంధనలు విస్మరించి కియ కార్లపరిశ్రమ సమీపంలోని యర్రమంచి, గుట్టూరు, అమ్మవారిపల్లి తదితర గ్రామాల్లోని అసైన్డ భూముల్లో ఏమాత్రం వ్యవసాయేతర భూములుగా మార్చడానికి వీలులేని అసైన్డ భూముల్లో చిన్న తరహా పరిశ్రమలు,హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు ఏర్పాటుచేసుకుని లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కియ సమీప గ్రామాల పరిధిలోని అసైన్డ భూములను లీజుకు తీసుకుని ఎకరాకు రూ.80వేలు నుంచి లక్ష దాకా నెలకు చెల్లిస్తూ హోటళ్లు, చిన్న పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్రమార్కులు అసైన్డ భూముల్లో లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొండుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా అక్రమార్కులపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హరిపురం జాతీయ రహదారి నుంచి కురుబవాండ్లపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపక్కన యర్రమంచి పొలం సర్వే నంబరు 200-1లో 2.72 ఎకరాల అసైన్డ భూమిలో చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేశారు. కొన్నేళ్లుగా ఈ భూమిలో అధికారులు చర్యలు మాత్రం అంతంతమాత్రమే. యర్రమంచి  పొలం జాతీయ రహదారి పక్కన ఉన్న 20.7సర్వే నంబరులోని 4.80సెంట్ల అసైన్డ భూమి ఉంది. ఈ భూముల్లో కొందరు రైతు వద్ద గత కొన్నేళ్ల నుండి లీజుకు తీసుకుని చిన్న పరిశ్రమలతోపాటు వెయింగ్‌ మిషన, హోటళ్లు నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. 


చర్యలు తీసుకుంటాం : నవీన, సబ్‌ కలెక్టర్‌ 

భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం అందజేసిన భూ ముల్లో వ్యవసాయం చేసుకోవాలి. అలాకాకుండా అసైన్డ భూముల్లో ఇతర అవసరాలకు ఉపయోగించుకుని వ్యాపారాలు నిర్వహించుకుంటే అలాంటి భూములను పరిశీలించి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.






Updated Date - 2021-12-09T05:23:42+05:30 IST